NTV Telugu Site icon

Indo American: కొడుక్కి విడాలిస్తానన్న కోడల్ని వెతికి మరీ చంపిన మామ

Indo American

Indo American

Indo American: కొడుక్కి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్న కోడలిపై కక్ష పెంచుకున్నాడు మామ. అమెరికాలోని కాలిఫోర్నియా మాల్ పార్కింగ్ లాట్‌లో కోడల్ని చంపిన కేసులో భారత సంతతికి చెందిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. శాంజోస్‌లో సెప్టెంబరు 30న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గురుప్రీత్‌ కౌర్‌ దోసాంజ్‌ శాంజోస్ వాల్‌మార్ట్‌లో పనిచేస్తుండగా.. 150 మైళ్ల దూరంలో ఉన్న తన కోడల్ని వెదుక్కుంటూ వచ్చిన ఆ వ్యక్తి తుపాకితో కాల్చి చంపినట్టు తెలుస్తోంది. మృతురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీతల్‌ సింగ్‌ దోసాంజ్‌ ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.

Read Also: Uber Cab: 6కి.మీ. ప్రయాణానికి రూ.32లక్షల బిల్లు.. షాక్‎లో ప్రయాణికుడు

ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు తన మేనమామకు ఫోన్ చేసిన గుర్‌ప్రీత్‌.. పరిస్థితిని ఆయనకు చెబుతుండగానే సీతల్ సింగ్ ఆమె వైపు దూసుకొచ్చి కాల్చి చంపినట్లు సమాచారం. సీతల్‌ తన కోసం గాలిస్తున్నాడని, తనకు చాలా భయంగా ఉంటూ గుర్‌ప్రీత్‌ తన మేనమామకు ఫోన్‌లో చెప్పిందని అధికారులు తమ నివేదికలో తెలిపారు. వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న బాధితురాలు.. విరామం సమయంలో బయటకు తన కారు వద్ద నిలబడింది. లాట్‌లో సీతల్‌ డ్రైవింగ్‌ చేస్తున్నట్టు చూశానని, తనను వెతుక్కుంటూ 150 మైళ్ల దూరం వచ్చాడని తన మేనమామకు వివరించింది. కారు దగ్గర ఉన్న గుర్‌ప్రీత్‌ వద్దకు సీతల్ దూసుకొస్తుండగా ఆమె భయంతో గట్టిగా కేకలు వేసిందని పోలీసులకు ఆమె మేనమామ తెలిపాడు. గుర్‌ప్రీత్‌ చివరి మాటలు అవేనని.. ఆ తర్వాత ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ అయిపోయిందని తమ దర్యాప్తు నివేదికలో పోలీసులు పేర్కొన్నారు.

Read Also:Gujarat: గుజరాత్‎లో గుట్టలుగా హెరాయిన్.. విలువ వందల కోట్లు

ఘటన జరిగి ఐదు గంటల తర్వాత వాల్ మార్టులో పనిచేసే తోటి ఉద్యోగి.. గుర్‌ప్రీత్‌ మృతదేహాన్ని ఆమె కారులోనే ఉండడం గుర్తించాడు. శరీరంపై రెండు బుల్లెట్‌ గాయాలు ఉండగా.. అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. గురుప్రీత్ భర్త, మామా ప్రెస్నోలో ఉంటుండగా.. విబేధాల కారణంగా శాంజోస్‌లో తన మేన కోడలు ఉంటోందని ఆయన తెలిపారు. విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని, ఇంతలో ఈ ఘోరం జరిగిపోయిందని పేర్కొన్నాడు. బాధితురాలి మేనమామ ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు సీతల్‌ను అనుమానితుడిగా గుర్తించారు. మర్నాడు ఉదయం అతడి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. ఇంట్లో సోదాలు నిర్వహించి తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.

Show comments