Indian 2 : ఇండియన్ 2 ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2..సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా ఉన్నాయి. రానున్న రిపబ్లిక్ డే నాడు మూవీ టీమ్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా భావిస్తున్నారు.అయితే ఆరోజే మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సోనీ మ్యూజిక్ మూవీ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ తోపాటు ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్ధార్థ్, బ్రహ్మానందం, సముద్రఖని, మధుబాల మరియు రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఇప్పటికే ఇండియన్ 2 నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే ఇంట్రో వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.భారతీయుడు మూవీని ఎక్కడ ముగించారో అక్కడి నుంచే ఈ సీక్వెల్ ను మొదలు పెట్టినట్లు ఇండియన్ 2 ఇంట్రో వీడియోలో చూపించారు..ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ వివరాలు బయటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఇండియన్ 2 రానుంది.ఇండియన్ 2 స్ట్రీమింగ్ వివరాలను నెట్‌ఫ్లిక్సే బుధవారం (జనవరి 17) అధికారికంగా వెల్లడించింది. తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆ వివరాలను తెలిపింది. “సేనాపతి ప్రతీకారంతో మళ్లీ వస్తున్నాడు. మనం సిద్ధంగా ఉండాలి. ఇండియన్ 2 థియేట్రికల్ రిలీజ్ తర్వాత త్వరలోనే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో మీ నెట్‌ఫ్లిక్స్ లో రానుంది” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని చెప్పింది
Also Read
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!