Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2”. బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో కాజల్ ,సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా బాబీ సింహా,ఏస్.జె.సూర్య వంటి తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా నటుడు కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాను జులై లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.అలాగే ఈ సినిమా కథ పెద్దది కావడంతో ఈ సినిమా మూడో పార్ట్ కూడా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు.
అలాగే ఇండియన్ 2 రిలీజ్ అయిన 6 నెలలకు ఇండియన్ ౩ రిలీజ్ చేయనున్నట్లు కమల్ తెలిపారు.అలాగే ఇండియన్ 2 ఆడియో లాంచ్ జూన్ 1 న నిర్వహిస్తున్నట్లు తెలిపారు .ఇదిలా ఉంటే ఈ ఈవెంట్ ను దర్శకుడు శంకర్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం సౌత్ లోని పలువురు స్టార్స్ ముఖ్య అతిధులుగా రానున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఈవెంట్ కి రాబోతున్నారంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.అయితే తాజాగా ఈ ఈవెంట్ కి వీరిద్దరితో పాటు మరికొంతమంది స్టార్ హీరోలు కూడా రాబోతున్నారని సమాచారం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్,మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే తమిళ్ స్టార్ హీరోలు శింబు, శివ కార్తికేయన్ ఈ ఈవెంట్ కు రానున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది