WTC 2024-25: మూడో టెస్టులోనూ ఓడితే.. ఫైనల్ ఆశలు గల్లంతయినట్లే!
- వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు
- రెండు టెస్టుల్లోనూ ఓడడంతో ఫైనల్ అవకాశాలపై ప్రభావం
- చివరి టెస్టులో గెలవడం భారత్‌కు అత్యవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లోనూ భారత్ ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్.. మూడోసారి కూడా ఆ దిశగా దూసుకెళ్లింది. అయితే భారత్‌కు న్యూజిలాండ్‌కు భారీ షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టుల్లోనూ కివీస్ చేతిలో ఓడడంతో టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపింది. అంతేకాదు ఫైనల్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు 73 గెలుపు శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది. గెలుపు శాతంలో మిగతా జట్లకు అందని స్థాయికి దూసుకెళ్లింది. అయితే బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓడిన తర్వాత కూడా టీమిండియా నంబర్ వన్‌గానే ఉంది. కానీ గెలుపు శాతం 62.82కి పడిపోయింది. ముంబైలో శుక్రవారం నుంచి జరిగే మూడో టెస్టులోనూ ఓడితే.. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయినట్లే. అగ్రస్థానం కోల్పోవడమే కాదు.. పట్టికలో కిందికి పడిపోనుంది.
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్‌కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
వచ్చే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని ఐదు టెస్టుల్లో ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టులు గెలిస్తేనే భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే పరిస్థితి ఉంటుంది. కంగారో గడ్డపై అన్ని విజయాలు సులువు కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు వరుస విజయాలు సాధిస్తున్న దక్షిణాఫ్రికా.. రోహిత్ సేనకు గట్టి పోటీ దారుగా ఉంటుంది. అందుకే ముందు కివీస్‌పై చివరి టెస్టులో గెలవడం భారత్‌కు అత్యవసరం. అప్పుడు ఆస్ట్రేలియాలో 3-2తో గెలిచినా అవకాశాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!