ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య చివరిదైన మూడో టీ20కి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచిన ఇరుజట్లు ఈ పోరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ అటు భారత్‌తో పాటు కివీస్‌కు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు జట్టులో చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. చాహల్ ప్లేస్‌లో ఉమ్రాన్ మాలిక్ భారత జట్టులోకి వచ్చాడు. అలాగే జాకబ్ డఫ్ఫీ ప్లేస్‌లో బెన్ లిస్టర్‌కు కివీస్ చోటిచ్చింది.
ప్రస్తుతం జట్టులో ఉన్న ఇషాన్ కిషన్‌కు ఈ స్టేడియంలో మంచి రికార్డే ఉంది. ఇంగ్లాండ్‌పై 165 పరుగుల లక్ష్య ఛేదనను భారత్ ఆడుతూపాడుతూ 18 ఓవర్లలోపే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్‌తోపాటు ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ బాదాడు. తొలి రెండు మ్యాచుల్లో ఇబ్బంది పడిన ఇషాన్.. మళ్లీ ఫామ్ అందుకోవడానికి ఇదొక అవకాశంగా భావించాలి. ఈ స్టేడియంలో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యకూ మంచి రికార్డే ఉంది. ఇక తొలి రెండు మ్యాచుల్లోనూ భారత టాప్ ఆర్డర్‌ను త్వరగా పెవిలియన్ చేర్చిన కివీస్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠికి జట్టులో స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా కివీస్ స్పిన్ బౌలర్ల దెబ్బకు భారత బ్యాటర్లు ఔట్ కావడం అభిమానులను నిరుత్సాహానికి గురి చేసే అంశం. క్లిష్టమైన సందర్భంలో ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంటుంది.
జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్‌దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారైల్ మిచెల్, మిచెల్ బ్రేస్‌వెల్, శాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోధి, బెన్ లిస్టర్, ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నెర్