NTV Telugu Site icon

IND vs AUS: తొలి వన్డేలో భారత్ ఘన విజయం

India Won

India Won

IND vs AUS: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో శనివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 27 ఏళ్ల తర్వాత మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. 277 టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా.. చివరకు ఆడి గెలిపించారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లు శుభ్మన్ గిల్(74), రుతురాజ్ గైక్వాడ్ (71) పరుగులతో భారత్ కు మంచి ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ (58), సుర్యకుమార్ యాదవ్ (50) పరుగులతో రానించారు. భారత్‌ తరఫున తొలి బౌలింగ్‌లో మహ్మద్‌ షమీ ఐదు వికెట్లు పడగొట్టాడు.

Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్‌‌కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా

ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ తన సొంత మైదానంలో ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశాడు. గిల్ కేవలం 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. గైక్వాడ్ 10 ఫోర్ల సాయంతో 71 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే శుభారంభం తర్వాత టీమిండియా మిడిల్ ఆర్డర్ తడబడింది. 142 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కేవలం 9 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. భారత్ 148 పరుగుల వద్ద రెండో వికెట్, 151 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. గైక్వాడ్, గిల్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

Atlee : అల్లుఅర్జున్ పై ఇష్టం ఆ విధంగా చూపించిన దర్శకుడు అట్లీ..

ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ కొన్ని దూకుడు షాట్లు ఆడినా ఇషాన్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్‌ వికెట్‌ వెనుక పాట్‌ కమిన్స్‌ క్యాచ్‌ ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా తరుఫున బౌలింగ్ లో ఆడం జంపా 2 వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ తీశారు. బ్యాటింగ్ లో వార్నర్(52), స్మిత్ (41), లబుషేంజ్(39), గ్రీన్ (31), స్టోయినీస్ (29), కమిన్స్ (21) పరుగులు చేశారు. త్వరలో ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్ కు ఈ గెలుపు భారత్ కు మంచి ఆరంభం అనుకోవచ్చు.