India vs Australia: ఆసీస్ గడ్డపై గర్జించిన భారత మహిళలు.. పదేళ్ల తర్వాత హిస్టరీ రిపీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Women Clinch T20 Series in Australia: ఆస్ట్రేలియా గడ్డపై భారత లేడీ సింగాలు గర్జించారు. కంగారూ సొంత గడ్డలో ఆ టీమ్‌ను 17 పరుగుల తేడాతో ఓడించారు. ఆస్ట్రేలియా గడ్డపై రెండోసారి టీ20 సిరీస్ గెలిచింది భారత మహిళల జట్టు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇంతకుముందు 2016లో తొలిసారి ఈ ఘనత సాధించిన ఉమెన్స్ టీమ్, తాజాగా మళ్ళీ చరిత్రను పునరావృతం చేసింది. ముందుగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన బాధ్యతాయుతంగా ఆడి కేవలం 55 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు స్కోర్ చేసి జట్టును నిలబెట్టింది. 149.09 స్ట్రైక్ రేట్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి ఆ తర్వాత గేర్ మార్చింది మంధాన.. మెంబర్స్ స్టాండ్‌లోకి కొట్టిన ఓ భారీ సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. పేసర్ డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. తన 160వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆమెకు ఇది 33వ అర్ధశతకం.
READ MORE: Hyderabad: జ్వరం అని వెళ్తే ప్రాణాలు తీశారు! వైద్యం వికటించి 6 నెలల శిశువు మృతి
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఓపెనర్ షఫాలీ వర్మ (7) త్వరగానే అవుటైనప్పటికీ, జెమీమా రోడ్రిగ్స్‌తో (46 బంతుల్లో 4 ఫోర్లతో 59 పరుగులు) కలిసి మంధాన ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి రెండో వికెట్‌కు ఏకంగా 121 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. కేవలం 66 బంతుల్లోనే వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించి చివర్లో భారీ స్కోరుకు బాటలు వేశారు. జెమీమా ఎంతో సంయమనంతో ఆడగా, మంధాన తన క్లాస్ షాట్లతో అలరించింది. అయితే చివర్లో ఈ ఇద్దరూ అన్నాబెల్ సదర్లాండ్ (2/34) బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యూహాత్మకంగా రిచా ఘోష్‌ను నాలుగో స్థానంలో పంపగా.. ఆమె ఆ నమ్మకాన్ని నిలబెడుతూ కేవలం 7 బంతుల్లోనే వేగంగా 18 పరుగులు చేసి జట్టు స్కోరును 175 దాటించింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా ఏ దశలోనూ కుదురుకున్నట్లు కనిపించలేదు. ఆష్లీ గార్డనర్ (45 బంతుల్లో 57 పరుగులు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో ఆసీస్ జట్టు 159/9 స్కోరుకే కుప్పకూలింది. భారత బౌలర్ల క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ముందు ఆతిథ్య జట్టు తలవంచింది. లెగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అద్భుత స్పెల్‌తో 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, అరంగేట్రం చేసిన శ్రీ చరణి 32 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పింది. అరుంధతి రెడ్డి కూడా 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి ఆసీస్ బ్యాటర్ల మధ్య పెద్ద భాగస్వామ్యాలు నమోదు కాకుండా అడ్డుకుంది. ఎట్టకేలకు పదేళ్ల తర్వాత మహిళల జట్టు రికార్డును పునరావృతం చేసింది.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్‌ప్లే, 144Hz డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..