IND W vs SA W: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక పోరు.. దక్షిణాఫ్రికాపై హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND W vs SA W: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు నేడు (జూన్ 21) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌లో తలపడనుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న టీమిండియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తుంది.
టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 64 పరుగుల తేడాతో ఓడించి ఘనంగా ఆరంభించింది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్ స్మృతి మంధానా, వికెట్‌కీపర్ రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్‌లతో జట్టుకు భారీ స్కోరు అందించగా.. దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై 95 పరుగుల భారీ విజయంతో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
Also Read
- Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
- Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
- AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
- Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఇప్పటివరకు ఐదుసార్లు సెమీఫైనల్‌కు చేరుకున్నప్పటికీ తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత్.. అదే జోరును దక్షిణాఫ్రికాపై కూడా కొనసాగించాలని లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే ప్రత్యర్థి దక్షిణాఫ్రికా జట్టు దూకుడైన బ్యాటింగ్‌తో పాటు బలమైన బౌలింగ్ దళాన్ని కలిగి ఉండటంతో ఈ పోరు ఉత్కంఠభరితంగా మారనుంది.
ఈ మ్యాచ్ ఫలితం భారత టాప్ ఆర్డర్ బ్యాటర్ల ప్రదర్శన, దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడి మధ్య జరిగే పోరుపైనే ఉంటుంది. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించే స్మృతి మంధానా, అనుభవజ్ఞురాలైన హర్మన్‌ప్రీత్ కౌర్, దూకుడైన షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌లు ఎంతమేర రాణిస్తారో చూడాలి మరి. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు జట్టుకు కీలకంగా మారనున్నారు.
దక్షిణాఫ్రికా తన గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 107 పరుగులకే ఆలౌట్ అయింది. మాంచెస్టర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో భారత స్పిన్ త్రయం, నెమ్మదైన బౌలింగ్ ఎంపికలు మ్యాచ్‌లో నిర్ణయాత్మకంగా మారవచ్చు. ఇప్పటివరకు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పలువురు ఆటగాళ్లు తమవంతు సహకారం అందించడం భారత జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్.
గత టీ20 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా ఒత్తిడిని తట్టుకుని ఆడగల జట్టుగా పేరుగాంచింది. రెండు జట్లలోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పగల ఆటగాళ్లు ఉండటంతో ఈ పోరు గ్రూప్ దశలో అత్యంత ఆసక్తికరమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలవనుంది.
భారత్ మహిళల జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధానా, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీచరణి, యస్తికా భాటియా, నందానీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, ప్రేమా రావత్, రాధా యాదవ్.
దక్షిణాఫ్రికా మహిళల జట్టు:
లారా వోల్వార్ట్ (కెప్టెన్), తాజ్మిన్ బ్రిట్స్, నదీన్ డి క్లర్క్, అనెరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయాబోంగా ఖాకా, సునే లూస్, కరాబో మేసో, నోన్కులెకో మలాబా, కైలా రినెకే, తుమి సెఖుఖునే, క్లో ట్రయాన్, డేన్ వాన్ నీకెర్క్.
తాజావార్తలు
-
Hyderabad Crime: ప్రేమికుడి వేధింపులు.. యువతి ఆత్మహత్య
-
Vijay Deverakonda: ప్రేక్షకులు నా మాటను నిజం చేశారు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
Earthquake: వనౌటులో రెండు శక్తివంతమైన భూకంపాలు.. 7.1 తీవ్రత నమోదు
-
AP ZPTC, MPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్లపై కూటమి కసరత్తు.. ఆశావహుల నామినేషన్లతో కూటమిలో టెన్షన్..
-
Trump: ఒప్పందం చేసుకోకపోతే మళ్లీ దాడి చేస్తాం.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!