Women’s Asia Cup 2026కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మందాన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Women Squad for Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026 టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును అధికారికంగా ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా కొనసాగనుండగా.. స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఈ జట్టులో షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్ వంటి ప్రధాన ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. అయితే స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కు మాత్రం నిరాశ ఎదురైంది. చీలమండ లిగమెంట్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఆమెకు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదు. ఇదే గాయం కారణంగా ఆమె టీ20 ప్రపంచకప్‌ను కూడా మధ్యలోనే వీడాల్సి వచ్చింది.
Also Read
శ్రేయాంక పాటిల్ ఆసియా కప్‌కు దూరమైనప్పటికీ.. ఆసియా గేమ్స్ నాటికి పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్‌కు ఆమె అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. మహిళల ఆసియా కప్ 2026 షెడ్యూల్‌ను ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ టోర్నీ ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ మధ్య వరకు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు ఆసియా గేమ్స్ నిర్వహించనున్నారు.
స్టార్ ప్లేయర్స్ తో ఉన్న జట్టు.. ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. రిజర్వ్ జాబితాలో ప్రతీకా రావల్, ఉమా చేత్రీ, వైష్ణవి శర్మ, సయాలి సాత్ఘరే, మిన్ను మణి వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటం జట్టుకు అదనపు బలం.
మహిళల ఆసియా కప్ 2026కు భారత జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందానా (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతి ఫుల్మాలీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, ప్రేమా రావత్, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్, ఎన్. శ్రీ చరణి, నందిని శర్మ.
రిజర్వ్ ఆటగాళ్లు:
ప్రతీకా రావల్, ఉమా చేత్రీ (వికెట్ కీపర్), వైష్ణవి శర్మ, సయాలి సాత్ఘరే, మిన్ను మణి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!