NTV Telugu Site icon

World Cup 2023: చంద్రయాన్‌ 3 విజయవంతం.. ఇక భారత్‌దే ప్రపంచకప్‌ 2023!

Odi World Cup 2023 New

Odi World Cup 2023 New

Chandrayaan 3 Successfully Landed on Moon And India Will Win World Cup 2023: భారత్ వేదికగా ఆక్టోబర్ 5 నుంచి సెప్టెంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత సొంత గడ్డపై జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2011లో సొంత గడ్డపై జరిగిన ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత్.. ఈసారి కూడా గెలుస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ సమయంలో తాజాగా ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ చేసిన ఓ ట్వీట్.. భారత జట్టు అభిమానుల్లో ప్రపంచకప్ ఆశలను మరింత పెంచింది. ప్రస్తుతం ముంబై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2019లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్ 2 మిషన్ విఫలమైన సంగతి తెలిసిందే. అదే సంవత్సరం జరిగిన వన్డే ప్రపంచకప్‌ 2019 సెమీస్‌ నుంచి భారత్‌ ఇంటిముఖం పట్టింది. లీగ్ దశలో వరుస విజయాలు అందుకున్న కోహ్లీ సేన.. కీలక సెమీస్‌లో మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిపోయింది. సెమీస్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 8 వికెట్లకు 239 రన్స్ చేసింది. ఆపై భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది.

Also Read: TVS X Electric Scooter: టీవీఎస్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌పై 140కిమీ ప్రయాణం!

2023లో చంద్రయాన్‌ 3 విజయవంతం అయింది. ఇదే సంవత్సరం భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023 జరుగనుంది. దాంతో చంద్రయాన్‌ 3 విజయవంతం అయిందని, ప్రపంచకప్‌ 2023 కూడా భారత్‌దే అని అర్ధం వచ్చేలా ముంబై ఇండియన్స్ ఓ ట్వీట్ చేసింది. ముంబై షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, ఫాన్స్ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు గత పొరపాట్లను సరిచేసుకుని అద్భుతమైన ఫలితం రాబట్టారు, భారత క్రికెటర్లూ కూడా ఈసారి ఉత్తమ ప్రదర్శనతో ప్రపంచకప్‌ సాధిస్తారు కామెంట్స్ చేస్తున్నారు.