India vs Zimbabwe: “టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం”.. జింబాబ్వే ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు!

Ind

Ind

India vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్‌లో భారత పరిస్థితి క్లిష్టంగా మారింది. మొన్న సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత సెమీస్ ఆశలు కష్టంగా మారాయి. సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 76 తేడాతో ఓడి పోవడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారింది. అయితే.. నేడు జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ మైనస్‌లోకి వెళ్లడంతో ఈ మ్యాచ్‌ ‘డూ ఆర్ డై’గా మారింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగే కీలక పోరులో భారత్‌ను ఎదుర్కొనేందుకు జింబాబ్వే సిద్ధమవుతోంది. అయితే.. జింబాబ్వే ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ మ్యాచ్‌కు ముందు సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ లాంటి పెద్ద టీమ్‌ను తాము లైట్ తీసుకుంటున్నామనే అర్థం వచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశాడు.

READ MORE: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు గొడవలకు ఆమడ దూరం ఉండాల్సిందే!

“టీమిండియా పెద్ద జట్టు. మేము వారిపై పెద్దగా ఫోకస్ చెయ్యం. మేము మాపై దృష్టి కేంద్రీకరించాం. మా ప్రణాళికలను అమలులోకి తెచ్చుకున్నాం. మా బ్యాటింగ్ గ్రూపులు, మా బౌలింగ్ గ్రూపులు, ఫీల్డింగ్ గ్రూపులలో సంబంధిత సంభాషణలు జరిపాం. మేము మాపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తాం.. ప్రత్యర్థిపై కాదు. వారు ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒటని మాకు తెలుసు. అయినా గెలిచి తీరుతాం” అని ధీమా వ్యక్తం చేశాడు. మైదానంలో తమ శక్తినంతా పెట్టేస్తామన్నాడు. ముంబైలో రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్ట్ ఇండీస్ చేతిలో ఎదురైన భారీ ఓటమి నుంచి తమ జట్టు చాలా నేర్చుకుందని చెప్పాడు. వెస్టిండీస్ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని, భారత్ వంటి బలమైన జట్టును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యామని ఎవాన్స్ తెలిపాడు. పెద్ద జట్లతో మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఒత్తిడి సహజమే అయినా, అలాంటి సందర్భాల్లోనే నిజమైన పోరాటస్ఫూర్తి బయటపడుతుందని అన్నాడు.

READ MORE: Off The Record : నరసన్నపేట పొలిటికల్ స్క్రీన్‌పై మారుతున్న సీన్స్..

ఇక భారత్‌కు ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైటిల్ డిఫెన్స్‌లో ఇప్పటికే ఒక భారీ దెబ్బ తగలడంతో ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ఫలితం సెమీఫైనల్ అవకాశాలపై నేరుగా ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. నెట్ రన్‌రేట్ మైనస్‌లో ఉండటం వల్ల కేవలం గెలవడం మాత్రమే కాకుండా భారీ తేడాతో విజయం సాధించడం కూడా కీలకంగా మారింది. గురువారం జరిగే డబుల్ హెడ్డర్ మ్యాచ్‌లు గ్రూప్ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. భారత్ గెలిస్తే తిరిగి రేసులోకి వస్తుంది. ఒకవేళ మరోసారి తప్పిదం జరిగితే మాత్రం సొంత గడ్డపై టైటిల్ రక్షణ ఆశలు దాదాపు ముగిసే ప్రమాదం ఉంది.