NTV Telugu Site icon

IND vs SA: ఇండియా vs సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్.. బార్బడోస్ పిచ్ రిపోర్ట్

Barbados

Barbados

ఈరోజు ఇండియా-సౌతాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. టాస్కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు బార్బడోస్‌లో వర్షం పడే అవకాశం ఉంది.. దీంతో మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవచ్చు. అయితే భారీ వర్షం కారణంగా ఈరోజు మ్యాచ్ పూర్తికాకపోతే రిజర్వ్ డే ఉంది. ఇక.. బార్బడోస్ పిచ్ గురించి చెప్పాలంటే స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ మద్దతునిస్తుంది.

ఇంతకుమందు ఈ పిచ్లో నమీబియా వర్సెస్ ఒమన్, స్కాట్లాండ్ వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌లు ఆడాయి. ఇప్పుడు ఫైనల్లో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తలపడనుంది. నమీబియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ తక్కువ స్కోరింగ్ నమోదైంది. మరోవైపు.. ఇంగ్లండ్‌పై స్కాట్లాండ్ 10 ఓవర్లలో 90 పరుగులు చేసినప్పటికీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ జరగలేదు. ఈ పిచ్లో ఫాస్ట్ బౌలర్లు అత్యధిక వికెట్లు పడగొట్టారు. బార్బడోస్‌లో ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు 20.22 సగటుతో 59 వికెట్లు తీశారు. ఈ పిచ్లో భారత్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక మ్యాచ్ ఆడింది. కాగా.. ఈ మ్యాచ్ లో టీమిండియా 181 పరుగులు చేసింది. మరోవైపు.. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌ ఇక్కడే ఆడింది.

Ind v/s SA : మహిళల టెస్టులో తొలిసారిగా 600 పరుగులు.. దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్రపంచ రికార్డు

బార్బడోస్ కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియం గణాంకాలు-రికార్డులు
మొదట బ్యాటింగ్ చేయడం ద్వారా గెలిచిన మ్యాచ్‌లు – 32
మొదట బ్యాటింగ్ చేయడం ద్వారా గెలిచిన మ్యాచ్‌లు – 19 (59.38%)
లక్ష్యాన్ని ఛేజింగ్ చేయడం ద్వారా గెలిచిన మ్యాచ్‌లు – 11 (34.38%)
టాస్ గెలిచి గెలిచిన మ్యాచ్‌లు – 19 (59.38%)
టాస్ ఓడిపోయి గెలిచిన మ్యాచ్‌లు – 11 (34.38%)
అత్యధిక స్కోరు – 224/5
అత్యల్ప స్కోరు – 80
చేజ్‌లో అత్యధిక స్కోరు – 172/6
మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సగటు స్కోరు – 153

మరోవైపు.. టీ20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మొత్తం 6 సార్లు తలపడగా.. ఇందులో టీమిండియా 4 సార్లు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలుపొందాయి.