India vs Pakistan LIVE Score, Asia Cup 2023: చిరకాల ప్రత్యర్థులు భారత్ -పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియా కప్ పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదికైంది. దాయాది జట్లు ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం పోరులో తలపడనున్నారు. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచమంతా ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
-
భారత్-పాక్ మ్యాచ్ రద్దు
భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. తొలుత భారత ఇన్నింగ్స్ వరుణుడు రెండు సార్లు ఆటంకం కలిగించాడు. మొత్తమ్మీద టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం వర్షం మళ్లీ మొదలు కాగా.. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పేశారు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో, గంటన్నరకు పైగా సమయం వృథా కావడంతో మ్యాచ్ రద్దయినట్లు ఫీల్డ్ అంపెర్లు ప్రకటించారు. దీంతో ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కింది.
-
మళ్లీ వర్షం అడ్డంకి.. కాస్త ఆలస్యంగా పాక్ ఇన్నింగ్స్
పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో పాక్ ఇన్నింగ్స్ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
-
భారత్ ఆలౌట్.. పాక్ లక్ష్యం@267
పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. పాకిస్థాన్‌కు 267 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. మొదట తడబడిన భారత జట్టు.. ఇషాన్ కిషన్(82), హార్ధిక్ పాండ్యా(87) రాణించడంతో గౌరవప్రదమైన స్కోరును సాధించింది.
-
8 వికెట్లు కోల్పోయిన భారత్
టీమిండియా వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 242 పరుగుల దగ్గర రవీంద్ర జడేజా(14), శార్దూల్ ఠాకూర్(3) ఔటయ్యారు.
-
హార్ధిక్ పాండ్యా(87) ఔట్.. ఆరు వికెట్లు డౌన్
సెంచరీ చేసేలా కనిపించిన హార్ధిక్ పాండ్యా(87) ఔటయ్యాడు. షాహీన్ అఫ్రీది వేసిన 44వ ఓవర్ తొలి బంతికి ఆఘా సల్మాన్‌కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు.
-
ఇషాన్ కిషన్ ఔట్.. నిరాశలో అభిమానులు
దూకుడు పెంచిన ఇషాన్ కిషన్(82) ఔటయ్యారు. ఇషాన్ 81 బంతుల్లో 82 పరుగులు చేసి హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో బాబర్ ఆజంకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో హార్ధిక్ పాండ్యా(66), రవీంద్ర జడేజా(0) ఉన్నారు.
-
200 దాటిన భారత స్కోరు.. దూకుడు పెంచిన హార్ధిక్, ఇషాన్
టీమిండియా బ్యాటర్లు హార్ధిక్ పాండ్యా(64), ఇషాన్ కిషన్(80)లు దూకుడు పెంచారు. వారు నిలకడగా రాణిస్తుండడంతో భారత్ 200 స్కోరును దాటగలిగింది. వీరిద్దరే 140 బంతుల్లో 134 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 37.3 ఓవర్లకు భారత్ స్కోరు 204/4.
-
రాణిస్తున్న ఇషాన్ కిషన్.. హార్ధిక్ అర్థ శతకం
ఇషాన్ కిషాన్(74) దూకుడుగా ఆడుతున్నాడు. హార్ధిక్ పాండ్యా కూడా తన అర్ధశతకాన్ని నమోదు చేసుకున్నాడు. వీరిద్దరు 126 బంతుల్లో 117 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసుకున్నారు. ఇప్పటికీ 35 ఓవర్లలో భారత్ 183/4 స్కోరు చేసింది.
-
నిలకడగా బ్యాటింగ్.. 30 ఓవర్లకు భారత్ స్కోరు ఇలా..
భారత బ్యాటర్లు నిలకడగా రాణిస్తున్నారు. భారత జట్టు 30.5 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ అర్థ శతకంతో రాణించాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్ (57), హార్ధిక్ పాండ్యా(42) ఉన్నారు.
-
అర్ధసెంచరీ చేసిన ఇషాన్ కిషన్
ప్రస్తుతం క్రీజులో హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ నిలకడగా ఆడుతున్నారు. ఇషాన్ కిషాన్ 54 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. దీంతో భారత్ స్కోరు నెమ్మదిగా ముందుగా కదులుతుంది.
-
నిలకడగా బ్యాటింగ్.. 100 దాటిన భారత్ స్కోరు
భారత బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(32), హార్దిక్ పాండ్యా(17) ఉన్నారు. ఎట్టకేలకు భారత స్కోరు 100 దాటింది. 20.3 ఓవర్లకు భారత్ స్కోరు 103/4.
-
శుభ్‌మన్ గిల్ క్లీన్ బౌల్డ్
టీమిండియా నాలుగో వికెట్‌ను కూడా కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన శుభమన్ గిల్(10) హారిస్ రవూఫ్ వేసిన 14.1 ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
-
తిరిగి ప్రారంభమైన మ్యాచ్
వర్షం తగ్గడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(8), శుభమన్ గిల్(8) ఉన్నారు. 12.5 ఓవర్లకు భారత్ స్కోరు 63/3.
-
గుడ్‌న్యూస్.. కాసేపట్లో ఆట తిరిగి ప్రారంభం
వర్షం ఆగిపోవడంతో ఆటను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. పిచ్‌పై ఉన్న కవర్లను సిబ్బంది తొలస్తున్నారు. కాసేపట్లో మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
-
మళ్లీ వర్షం అడ్డంకి
మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. సిబ్బంది పిచ్‌పై మరోసారి కవర్లను కప్పుతున్నారు. 11.2 ఓవర్లు పూర్తయిన తర్వాత వర్షం మొదలైంది. అప్పటికీ భారత్ స్కోరు 51/3 గా ఉంది.
-
3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో టీమిండియా.. శ్రేయస్ ఔట్
టీమిండియా మూడో వికెట్‌ను కూడా కోల్పోయి తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్(14) ఔటయ్యాడు.
-
కష్టాల్లో భారత్.. విరాట్ కోహ్లీ ఔట్
టీమిండియాకు మరో గట్టి షాక్ తగిలింది. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(4) కూడా ఔటయ్యి వెనుదిరిగాడు. షాహీన్ అఫ్రీది వేసిన 6వ ఓవర్ మూడో బంతికి కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత్ స్కోరు 29/2.
-
మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్ శర్మ ఔట్
రోహిత్ రూపంలో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. షహీన్ అఫ్రీది వేసిన 5వ ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ(11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(0), శుభమన్ గిల్(1) ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 15/1.
-
ఆగిన వర్షం.. మ్యాచ్ ప్రారంభం
ఆసియా కప్: పల్లెకెలెలో వర్షం తగ్గుముఖం పట్టింది. పిచ్‌పై ఉన్న గ్రౌండ్ కవర్లను తొలగించి సిబ్బంది గ్రౌండ్‌ను సిద్ధం చేస్తున్నారు. కాసేపట్లో మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది. క్రీజులోకి వచ్చేందుకు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ సిద్ధమవుతున్నారు.
-
భారత్-పాక్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకి
భారత్-పాక్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. 4.2 ఓవర్ల సమయంలో వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు.
-
4.2 ఓవర్లలో భారత్ స్కోరు వివరాలు ఇలా..
4.2 ఓవర్లలో భారత్ 15 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(11), శుభమన్ గిల్(0) ఉన్నారు. శుభమన్ గిల్ 8 బంతులు ఆడి ఇంకా పరుగుల ఖాతా తెరవకపోవడం గమనార్హం. ప్రస్తుతం భారత్ స్కోరు 15/0
-
బరిలోకి భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్
శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఆసియా కప్ పోరులో భారత బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజులోకి వచ్చారు. తొలి ఓవర్‌ను పాక్ బౌలర్ షహీన్ షా అఫ్రీది వేశాడు.
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ టాస్ నెగ్గింది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తుది జట్లు
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.పాకిస్తాన్:
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్.