India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మైదానంలోనూ ఘోరంగా అవమానించింది. అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్థించుకున్నాడు. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నించింది. కానీ ఏం లాభం లేకుండా పోయింది.
READ MORE: Charlapalli Murder: సంచిలో మృతదేహం కేసులో పురోగతి.. ఆమె ఎవరంటే..?
కాగా.. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మ్యాచ్‌నే ఆడొద్దని డిమాండ్లు వచ్చినా సరే.. పాక్‌ను ఢీకొట్టి విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన పని భారత అభిమానులను ఆకట్టుకుంది. కనీసం పాక్ క్రికెటర్లతో కరచాలనం కూడా చేయకుండా.. ఈ గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమ్‌ఇండియా ప్రకటించింది. అక్కడ నుంచి పాక్ ఆక్రోశం మొదలైంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని డిమాండ్ చేసింది. కీలకమైన యూఏఈతో మ్యాచ్‌నూ బాయ్‌కాట్ చేస్తామని, టోర్నీ నుంచి వెళ్లిపోతామనే బెట్టు చేసింది. వెళ్లిపోతే ఆర్థికంగా నష్టమని గ్రహించారేమో.. పైకి మాత్రం రిఫరీ పైక్రాఫ్ట్ ‘క్షమాపణలు’ చెప్పాడని, తాము ఆడతామని స్వయంప్రకటన జారీ చేసింది. యూఏఈపై గెలిచి సూపర్-4లో అడుగు పెట్టింది.
READ MORE: OG : ఓజీ కాన్సర్ట్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు పండగే
అయితే.. మొదటి మ్యాచ్(భారత్-పాకిస్థాన్)ను క్రికెట్ అభిమానులు, పహల్గాం బాధితులు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ భారత్ పాకిస్థాన్‌ను తీవ్రంగా అవమానించడంతో అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 లో రేపు పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలి. బాయ్‌కాట్ చేయాలి అనే నినాదాలు, నిరసనలు కనిపించడం లేదు. ఇప్పుడు అందరి దృష్టి ఒకే అంశంపై ఉంది. అందేంటంటే.. ఈ సారి టీమిండియా పాకిస్థాన్‌ను ఎలా అవమానించబోతోంది? ఈ సారి ఏం చేయబోతోంది? టీమిండియా ప్లేయర్లు షేక్‌హ్యాండ్ ఇస్తారా? లేదా కొత్త తీరు ఎంచుకుని పాకిస్థాన్‌ను అవమానిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ.. రేపటి మ్యాచ్‌లో సైతం భారత్ ఘన విజయం సాధించి దాయాది దేశానికి బుద్ధి చెప్పాలని అందరూ భావిస్తున్నారు.
