Ind vs Pak: ఆసియా కప్ 2025 లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా 25 మరో బంతులు మిగిలి ఉండగానే పాకిస్తాన్ నిర్ణయించిన టార్గెట్ ను 3 వికెట్లు కోల్పోయి చేధించింది. దీనితో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన 127 పరుగులను సాధించింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తక్కువ పరుగులకే పాకిస్తాన్ పరిమితమైంది.
Minister Seethakka : మేడారం మహాజాతర కోసం అటవీ మార్గాల్లో కొత్త రహదారులు
ఇక తక్కువ పరుగుల ఛేదనకు వచ్చిన టీమిండియ బ్యాటర్లు మొదటి నుంచే ఎదురు దాడికి దిగారు. అనంతరం 128 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ గిల్ (10), అభిషేక్ శర్మ (31) వికెట్లను కోల్పోయినా.. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మల జోడి మ్యాచ్‌ను మలుపు తిప్పింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 37 బంతుల్లో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా, చివర్లో శివమ్ దూబే (10 నాటౌట్) తో కలిసి సూర్యకుమార్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. పాకిస్తాన్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లు తీసినప్పటికీ, మిగతా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించలేకపోయారు.
Hyderabad : హైదరాబాద్ టోలిచౌకీలో అక్రమంగా తరలించిన జింక మాంసం పట్టివేత
