NTV Telugu Site icon

Ind vs NZ : నేడు ఉప్పల్‌ వేదికగా తలపడనున్న న్యూజిలాండ్-ఇండియా

India

India

నేడు హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌-ఇండియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే శ్రీలంకపై వన్డే, టీ20 గెలిచి విజయోత్సాహంతో ఇండియా ఉంది. ఈ వరుస విజయాలతో ఫుల్​ జోష్​ మీదున్న భారత్​ ఇప్పుడు న్యూజిలాండ్​తో మూడు వన్డేలు, మూడు టీ20ల సమరానికి సిద్ధమైంది. మరోవైపు పాకిస్తాన్‌పై వన్డే సిరీస్‌ గెలిచి న్యూజిలాండ్‌ కూడా జోరుమీదుంది. అయితే.. నేడు ఉప్పల్‌లో కివీస్‌-భారత్‌ల మధ్య తొలి వన్డే మ్యాచ్‌ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. వన్డేల్లో, టీ20ల్లోనూ కివీస్ పై భారత్‌ పైచేయిగా ఉంది. మరి నేడు తొలి మ్యాచ్ గెలిచి సిరీస్ లో బోణీ ఎవరు కొట్టనున్నారో చూడాలి మరీ..

Also Read : NTR Death Anniversary: తారక రామనామం… సదా స్మరామి

భారత జట్టు అంచనా:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎస్ భరత్, రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌,శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌,ఉమ్రాన్‌ మాలిక్.

న్యూజిలాండ్ జట్టు అంచనా:

టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.

Show comments