India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం

India Vs New Zealand

India Vs New Zealand

India vs New Zealand: న్యూజిలాండ్‌తో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అనూహ్య విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో (DLS Method) భారత్ 4 పరుగుల తేడాతో విజయం వరించింది. ఉత్కంఠభరితంగా ముగియాల్సిన ఈ మ్యాచ్ ఇలా అర్ధంతరంగా ముగియడం ఫ్యాన్స్‌కి కాస్త నిరాశ కలిగించింది. మ్యాచ్ రద్దయ్యే సమయానికి భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ సమయంలో డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం భారత్ 4 పరుగులు ఆధిక్యంలో ఉంది. వెల్లింగ్టన్‌లో (Wellington) జరిగిన ఈ రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించగా, గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) అద్భుతమైన బౌలింగ్‌తో (4/30) చెలరేగిపోవడంతో న్యూజిలాండ్ జట్టు కేవలం 41 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ (All out) అయింది.

ఇక, న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డేరిల్ మిచెల్ (Daryl Mitchell) 55 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిచెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) కలిసి ఆరో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. గుర్నూర్‌తో పాటు అక్షర్ పటేల్ (Axar Patel), ఆకిబ్ నబీ (Auqib Nabi), అన్షుల్ కంబోజ్ (Anshul Kamboj) తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక, 135 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు తడబడ్డారు. శ్రేయస్‌ 30, రోహిత్‌ 23, రాహుల్‌ 26, నమన్‌ 12 రన్స్‌ చేశారు. దీంతో టీమిండియా భారత్ 26 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను కొంత సేపు ఆపారు. వరుణుడు ఎంతటికీ కరుణించపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక, డీఎల్‌ఎస్‌ ప్రకారం భారత్ టార్గెట్‌ 109కు చేరింది. దీంతో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు.. న్యూజిలాండ్‌ బౌలర్లలో డఫీ, జెమీసన్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫిషర్‌ ఒక వికెట్‌ తీశాడు. ఈ విజయంతో 5 వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలోకి వచ్చింది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో (ODI series) ఇప్పటికే వర్షం వల్ల ప్రభావితమైన మొదటి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచిన భారత్, ఇప్పుడు ఈ విజయంతో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లేందుకు చూస్తోంది.