భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టీ20 లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 19.4 ఓవర్లలోనే ఛేదించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరిసిన సంజూ శామ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన అద్భుత ప్రదర్శన, జట్టు విజయం గురించి ఆయన ఇలా మాట్లాడాడు. చాలా సంతోషంగా ఉంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను గెలిచిన ఈ సందర్భం చాలా ప్రత్యేకమైనది. మనం చేసే సహకారం జట్టుకు విజయాన్ని అందించినప్పుడు ఆ అనుభూతే వేరు. ఈ రోజు మ్యాచ్ గెలిచేందుకు జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారు. ఇది సంపూర్ణంగా ఒక టీమ్ గేమ్. ఈ సిరీస్‌ను విజయాస్పదంగా ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది.
అభిషేక్ శర్మతో కలిసి మైదానంలో అడుగు పెట్టాక మా మధ్య చాలా సంభాషణలు జరుగుతుంటాయి, కానీ అందులో పెద్దగా విశ్లేషణలేమీ ఉండవని సంజూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా బంతి ఏ విధంగా వస్తుంది.. దానిని ఎలా బౌండరీకి దాటించాలనే ఆలోచనతోనే ఉంటామన్నారు. ఇద్దరం కలిసి సంభాషించుకున్న తర్వాత బంతి టెక్నిక్ తెలిసింది. ఈ వ్యూహం మాకు బాగా పనిచేసిందని అన్నారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో అతనితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టమని పేర్కొన్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ ఆడే సమయంలో బంతి బాగా స్వింగ్ అయిందని.. నిజం చెప్పాలంటే కొద్దిగా ఎక్కువగానే స్వింగ్ అయిందని తెలిపాడు. కానీ పిచ్ నుంచి బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వచ్చింది. అందుకే నేను, అభి పవర్ ప్లేలో సరైన షేప్ కొనసాగిస్తూ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఆడాలని భావించాం. పవర్ ప్లేలోనే మాకు అద్భుతమైన ఆరంభం లభించడంతో, మ్యాచ్ ఫలితాన్ని మొదట్లోనే తేల్చేయవచ్చని మాకు అనిపించింది. 6 ఓవర్లలోనే 90 పైచిలుకు పరుగులు రావడం అత్యుత్తమ ఆరంభం. అందుకే మేము ఏమాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాలనుకున్నామని సక్సెస్ సీక్రెట్‌ను చెప్పాడు.

