NTV Telugu Site icon

India vs England: కోహ్లీ, వరుణ్‌ చక్రవర్తి ఇన్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లీష్ జట్టు

India Vs England (1)

India Vs England (1)

India vs England: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనున్న భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం. సిరీస్ గెలవాలనే ఉద్దేశ్యంతో టీం ఇండియా ఈ మ్యాచ్‌లోకి దిగుతుండగా.. ఇంగ్లాండ్ జట్టు సిరీస్‌ను డ్రా చేసుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దీనితో మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Also Read: Daggubati Purandeswari: కార్యకర్తల కృషి వల్లే ఢిల్లీలో విజయం సాధ్యమైంది!

ఇక ఇప్పటివరకు భారత్, ఇంగ్లాండ్ మధ్య 108 వన్డే మ్యాచ్‌లు జరిగగా.. వీటిలో భారత్ 59 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ 44 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఫలితం రాలేదు. ఇక ఈ మ్యాచ్ తో వరుణ్ చక్రవర్తి వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నారు. T20 సిరీస్‌లో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పీఠిన ఈ మిస్టరీ స్పిన్నర్ టీమిండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా నుండి టోపీని అందుకున్నాడు. ఇక నేడు ఇరు జట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: RITES Recruitment 2025: డిగ్రీ, బీటెక్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్.. మిస్ చేసుకోకండి

టీమిండియా ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు:

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సక్బ్ మహ్మూద్