Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs England 3rd ODI: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, సిరీస్ విజేతను నిర్ణయించే అసలైన సమరం. గత మ్యాచ్‌లో జో రూట్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ సమం చేసిన ఇంగ్లాండ్ జట్టు ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు టీమిండియా ఈ నిర్ణయాత్మక పోరులో గెలవాలంటే తమ ఓపెనింగ్ సమస్యలను వెంటనే అధిగమించాల్సి ఉంది. ముఖ్యంగా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ నెమ్మదైన బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తుండగా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీలపైనే జట్టు బ్యాటింగ్ భారం ఎక్కువగా పడేలా కనిపిస్తోంది.
ఈ కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్ జట్టుకు దూరం కావడం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇది మన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలాన్ని తగ్గించేలా ఉంది. దీంతో ఇప్పుడు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌పై బాధ్యత మరింత పెరిగింది. అలాగే ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పాత్ర ఈ మ్యాచ్‌లో అత్యంత కీలకం కానుంది. ఇక లార్డ్స్ పిచ్ విషయానికి వస్తే, ఇక్కడ మ్యాచ్ ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు మంచి స్వింగ్ దొరుకుతుంది. కానీ సమయం గడిచేకొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా మారుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టుకు పిచ్ పరిస్థితులు కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన బౌలర్లను ఎంత క్రమశిక్షణతో ఆడిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
క్రికెట్ అభిమానుల ఉత్కంఠను రేపుతున్న ఈ మ్యాచ్ విశేషాల్లోకి వెళితే.. ఇక ఈ మ్యాచ్ లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందే అంటే మధ్యాహ్నం 3:00 గంటలకు టాస్ వేస్తారు. ఈ మ్యాచ్‌ను టీవీలో చూడాలనుకునే వారు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో వీక్షించవచ్చు. ఒకవేళ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడాలనుకుంటే జియోహాట్‌స్టార్ (JioHotstar) యాప్ లేదా వెబ్సైట్లో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ఆస్వాదించవచ్చు. ఇక, ఈ చారిత్రాత్మక మ్యాచ్ కోసం బరిలోకి దిగే ఇరు జట్ల అంచనా వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ vs ఇంగ్లాండ్ అంచనా ప్లేయింగ్ ఎలెవన్..
టీమిండియా తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (WK), అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్/హర్ష్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్ తుది జట్టు (అంచనా): బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్/జోష్ టంగ్, సాకిబ్ మహమూద్/జోష్ టంగ్, ఆదిల్ రషీద్
తాజావార్తలు
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!