NTV Telugu Site icon

IND vs AUS : ఆసీస్ తో మూడో వన్డేకు సిద్ధం.. సిరీస్ పై కన్నేసిన భారత్

Ind Vs Aus

Ind Vs Aus

విశాఖలో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. కీలకమైన మూడో వన్డేకు సిద్దమైంది. ఈ మ్యాచ్ జరగననున్న చెన్నైలోని చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో మరీ.. ఆస్ట్రేలియా తొలి వన్డేలో కష్టం మీద గెలిచి, రెండో వన్డేలో చిత్తుగా ఓడిన రోహిత్ సేన.. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు సిద్దమైంది. అయితే ఇవాళ కూడా చెన్నైలో కంగారుల నుంచి సవాలు తప్పకపోవచ్చు.. ఎందుకంటే చెపాక్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తి రేపుతుంది.

Also Read : Wednesday Stotram: బుధవారం భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి

తొలి వన్డేలో ప్లేయర్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ప్రదర్శన కారణంగా గట్టెక్కిన భారత్ జట్టు.. రెండో వన్డేలో పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్ లో మిచెల్ స్టార్క్ ను ఎదుర్కోలేక.. బౌలింగ్ లో మిచెల్ మార్ష్ ను అడ్డుకోలేకపోయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు కీలకమైన లాస్ట్ వన్డేలో భారత్ గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్ తప్పక మెరుగుపడాల్సిందే.. అయితే టీమ్ ఇండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ తో భారత జట్టు బలమైన టాప్ ఆర్డర్ ఉంది. ఆసీస్ తో సిరీస్ లో మాత్రం ఇప్పటి వరకూ వీళ్లు అంచానాలను అందుకోలేదు. తొలి వన్డేలో గిల్, కోహ్లీ, సూర్య(0) కలిపి 24 పరుగులు చేశారు. విశాఖ మ్యాచ్ లో రోహిత్ తో సహా ఈ నలుగురు కలిసి 44 పరుగులు చేశారు.

Also Read : Ugadi Bhakthi tv live: ఉగాది నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీకు ఎదురే ఉండదు

అయితే సెకండ్ వన్డేలో గిల్, సూర్య సున్నాకే వెనుదిరిగారు.. ఇప్పుడు ఈ మూడో వన్డేలో మాత్రం టీమిండియా గెలవాలంటే వీళ్లు నిలవాలి. ముఖ్యంగా గిల్, సూర్యకుమార్ యాదవ్, గత రెండు వన్డేల్లో స్టార్క్ బౌలింగ్ లో ఒకే తరహా వికెట్ పారేసుకున్నారు. దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి గిల్, వికెట్ల ముందు సూర్య దొరికిపోయారు. వీళ్లు ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాల్సి ఉంది. హార్దిక్ పాండ్య కూడా ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేయడం జట్టుకు అవసరం. తొలి వన్డేకు ఆస్ట్రేలియా పోరాడే స్కోర్ చేయగలిగిందంటే.. రెండో వన్డేలో 10వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం మిచెల్ మార్ష్. వార్నర్ గైర్హజరీలో ఈ సిరీస్ తో ఓపెనర్ అవతారం ఎత్తిన అతడు అదరగొడుతున్నాడు.

Also Read : Ugadi Panchanga Sravanam Bhakthi Tv Live: ఉగాది పంచాంగ శ్రవణం లైవ్

గత వన్డేలో మిచెల్ మార్ష్ కు తోడుగా ట్రావిస్ హెడ్ కూడా చెలరేగాడు. వీళ్ల బాదుడుకు షమి, సిరాజ్ సహా భారత బౌలర్లందరూ తేలిపోయారు. ఈ సిరీస్ భారత్ కైవసం కావాంటే ఈ ఇద్దరినీ వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చాలి. అందుకు మన బౌలర్లు సరైన ప్రణాళికలతో మైదానంలో అడుగు పెడితేనే మ్యాచ్ గెలుస్తాం. రెండో వన్డేలో ఘన విజయం సాధించి సిరీస్ పై కన్నేసిన కంగారూలు అందుకు తగ్గట్లు తమ అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. టీమ్ ఇండియాతో ఢిల్లీ టెస్టులో కంకషన్ తో పాటు గాయానికి గురై ఆ తర్వాత మ్యాచ్ లకు దూరమైన డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్లుగా వార్నర్ హెడ్ కు మంచి రికార్డే ఉంది. ఏడు మ్యాచ్ ల్లో ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జోడి, అందులో మూడింట్లో 284,269,147 పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పింది. వార్నర్ వస్తే మార్స్, అవసరాన్ని బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో వేరే స్థానంలో వస్తాడు.