Team India: 400 ప్లస్ స్కోర్‌తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు, ఆస్ట్రేలియా మూడు సార్లు, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు రెండేసి సార్లు ఈ ఘనత సాధించాయి.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులకే అవుటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రోహిత్ శర్మ పాత రోజులను గుర్తు చేస్తూ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి ముందు రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Also Read
- AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
- Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
- Virat Kohli vs Pakistan: భారత్ - పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
- AP Local Body Elections: పల్నాడు, వినుకొండలో హైటెన్షన్.. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు!
రోహిత్ అవుటైన తర్వాత శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ పోటీ పడి సెంచరీలు బాదడమే కాకుండా మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. వన్డేల్లో భారత్ తరఫున మూడో వికెట్‌కు ఇది నాలుగో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. కెప్టెన్‌గా గిల్ తన మొదటి వన్డే సెంచరీని పూర్తి చేసుకుని, మొత్తం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులు చేశాడు. మరోవైపు ఈషాన్ కిషన్ వన్డేల్లో తన రెండో సెంచరీని నమోదు చేస్తూ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు రాబట్టాడు. ఈ భారీ స్కోరుతో భారత్ వన్డేల్లో తన ఎనిమిదో అత్యధిక స్కోరును నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 56 పరుగులు చేసి పోరాడుతోంది.
తాజావార్తలు
-
మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
-
AP Local Body Elections 2026: సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ భేటీ.. జడ్పీ సీట్ల సర్దుబాటుపై కీలక చర్చ!
-
Anti Suicide Fans: ఫ్యాన్‌కు ఉరేసుకుంటే కిందపడిపోతారు.. ఆత్మహత్యల నివారణకు గుజరాత్ వర్సిటీ మాస్టర్ ప్లాన్..
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ట్రెండింగ్
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!