US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US LPG Supply: భారత్, అమెరికాల మధ్య బంధం గత ఏడాది కాలంలో మరింత బలపడింది. ముఖ్యంగా ఇంధన రంగంలో ఇరు దేశాల మధ్య వ్యాపారం గణనీయంగా పెరిగింది. మన దేశానికి ఎల్పీజీ (LPG) సరఫరా చేయడంలో అమెరికా ఇప్పుడు అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారిణి బెథానీ మోరిసన్ స్వయంగా వెల్లడించారు. న్యూయార్క్‌లోని ఫారిన్ ప్రెస్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన మోరిసన్, గతేడాది కాలంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఎంతగానో విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం భారత్-అమెరికాలు కేవలం ఒక్క రంగంలోనే కాకుండా ఇంధనం, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, వ్యాపారం వంటి కీలక విభాగాల్లో భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని చెప్పారు.
భారత్ తన ఇంధన అవసరాల కోసం కేవలం ఒకే దేశంపై ఆధారపడకుండా విభిన్న మార్గాల ద్వారా సరఫరాను పెంచుకుంటోందని, ఈ క్రమంలో అమెరికా ఒక ప్రధాన సప్లయర్‌గా అవతరించిందని ఆమె పేర్కొన్నారు. భారత్‌కు అత్యధికంగా ఎల్పీజీని ఎగుమతి చేసే దేశంగా అమెరికా నిలవడం తమకు ఎంతో గర్వకారణమని, ఇంధన వనరులను విస్తరించుకునే భారత ప్రయత్నంలో తాము భాగస్వామి కావడం సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీంతోపాటు ఇరు దేశాల మధ్య కుదిరిన 10 ఏళ్ల రక్షణ ఒప్పందాన్ని (డిఫెన్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రిమెంట్) కూడా మోరిసన్ ప్రస్తావించారు. రక్షణ రంగంతో పాటు అణు ఇంధన రంగంలోనూ ఇరు దేశాలు వేగంగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్ తన అణు రంగానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేస్తూ ‘శాంతి చట్టం’ (SHANTI Act) తీసుకువచ్చిందని, దీనివల్ల పౌర అణు ఇంధన రంగంలో రెండు దేశాల మధ్య సహకారం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. భారత్, అమెరికా బంధం కేవలం ఇంధనం, రక్షణ రంగానికే పరిమితం కాలేదని, రెండూ కలిసి పెద్ద ఎత్తున వ్యాపార ఒప్పందాలు చేసుకుంటున్నాయని మోరిసన్ తెలిపారు. ‘క్వాడ్’ వంటి కీలక వేదికలపై కూడా ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పారు. ట్రంప్ ప్రభుత్వానికి దక్షిణ ఆసియా ప్రాంతం ఎంతో కీలకమైనదని స్పష్టం చేసిన ఆమె, గతంలో ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే దక్షిణ ఆసియాపై దృష్టి పెట్టేవారని గుర్తుచేశారు.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
- Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
- CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
- Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!