NTV Telugu Site icon

India Unemployment Rate: ఈ ఏడాది డిసెంబర్‌ డేటా. సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ వెల్లడి

India Unemployment Rate

India Unemployment Rate

India Unemployment Rate: ఈ సంవత్సరం ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ రేట్ డిసెంబర్‌ నెలలో అత్యధికంగా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అనే సంస్థ వెల్లడించింది. భారతదేశ నిరుద్యోగ రేట్ 2022 డిసెంబర్‌ 20వ తేదీ నాటికి 9 శాతానికి చేరింది. థర్టీ డే మూవింగ్‌ యావరేజ్‌ ప్రాతిపదికన ఇది నవంబర్‌లో 8 శాతంగానే ఉంది. నెల రోజుల్లోనే వన్‌ పర్సెంట్‌ పెరిగింది.

సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ నిర్వచనం ప్రకారం అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ రేట్‌ అంటే.. పని చేయటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల సంఖ్య అని అర్థమే తప్ప ఉద్యోగం దొరకనివారి సంఖ్య అని కాదు. గడచిన 12 నెలల యావరేజ్‌ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ రేట్‌ 7 పాయింట్‌ 4 అని సీఎంఐఈ రిపోర్టు తెలిపింది. ఈ సగటు నిరుద్యోగ రేట్‌ 6 పాయింట్‌ 4 నుంచి 8 పాయింట్‌ 3 రేంజ్‌లో ఊగిసలాడినట్లు పేర్కొంది.

Gold Shine in 2023: వచ్చే ఏడాది.. మాంద్యం వచ్చినా.. రాబడి తగ్గినా.. నో ఎఫెక్ట్‌..

అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ రేట్‌ పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 10 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8 పాయింట్‌ 5 శాతానికి చేరటం పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్య విషయమని వివరించింది. రూరల్‌ ఏరియాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో ఉన్నప్పటికీ నిరుద్యోగం రేట్‌ పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువ హెచ్చుతగ్గులకు లోనైందని సీఎంఐఈ ఎండీ అండ్‌ సీఈఓ మహేశ్‌ వ్యాస్‌ అన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ రేట్‌ హర్యానాలో ఎక్కువగా ఉంది. అక్కడ నవంబర్‌ నెలలో నిరుద్యోగం రేట్‌ 30 పాయింట్‌ 6 శాతానికి ఎగబాకింది. హర్యానా తర్వాత 24 పాయింట్‌ 5 శాతంతో రాజస్థాన్‌ రెండో స్థానంలో ఉంది. 23 పాయింట్‌ 9 శాతంతో జమ్మూకాశ్మీర్‌ మూడో స్థానంలో నిలిచింది. నిరుద్యోగం రేట్‌ ఛత్తీస్‌గఢ్‌లో అతితక్కువగా.. అంటే.. సున్నా పాయింట్‌ ఒక శాతమే ఉండటం విశేషం.

1 పాయింట్‌ 2 శాతంతో ఉత్తరాఖండ్‌, 1 పాయింట్‌ 6 శాతంతో ఒడిశా.. రెండు.. మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌.. ఈపీఎఫ్‌ఓ లెక్కల ప్రకారం.. ఫార్మల్‌ జాబ్‌ క్రియేషన్‌ సైతం భారీగా పడిపోయింది. సెప్టెంబర్‌లో 16 లక్షల 80 వేల మందికి పైగా ఉద్యోగాల్లో చేరగా ఆ సంఖ్య అక్టోబర్‌లో 12 లక్షల 90 వేలకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3వ అతితక్కువ ఉద్యోగ చేరికలు కావటం గమనించాల్సిన విషయం.

ఇదిలాఉండగా.. ఫార్మల్‌ జాబ్‌ క్రియేషన్‌లో.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం అక్టోబర్‌లో మార్జినల్‌ గ్రోత్‌ చోటుచేసుకోవటం చెప్పుకోదగ్గ విషయం. ఈసారి కన్నా పోయినేడాది అక్టోబర్‌లో 20 వేల మంది తక్కువగా.. అంటే.. 12 లక్షల 70 వేల మందే ఈపీఎఫ్‌ఓలో చేరారు.