NTV Telugu Site icon

Digital Payments: డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రస్థానం

Digital Pyments

Digital Pyments

2022 ( గతేడాది)లో అత్యధిక డిజిటల్‌ చెల్లింపు లావాదేవీలు నమోదైన దేశాల జాబితాలో భారత దేశం అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ మైగవ్‌ఇండియా శనివారం విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడించింది. 2022లో భారత్ 8,950 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్త రియల్‌టైం పేమెంట్స్‌లో మన దేశం వాటా 46 శాతంగా ఉంది. భారత్‌ తరువాత నాలుగు స్థానాల్లో ఉన్న దేశాల మొత్తం లావాదేవీల కంటే అధికం ఇది. డిజిటల్‌ చెల్లింపుల లావాదేవీల సంఖ్యతో పాటు వాటి విలువపరంగానూ భారత్‌ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

Read Also: Sachin Pilot: సచిన్ ఫైలట్ పైనే అందరి దృష్టి.. నేటి సభ పై సర్వత్రా ఉత్కంఠ

భారత్ చెల్లింపుల వ్యవస్థ సమగ్రతతో పాటు డిజిటల్‌ సాంకేతికతపై ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో భారత్‌ తొలి స్థానంలో కొనసాగుతోంది. సరికొత్త ఆవిష్కరణలు, దేశం నలుమూలలా వినియోగంతో భారత్‌ నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని మైగవ్‌ఇండియా వెల్లడించింది. డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ తర్వాత బ్రెజిల్‌ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. గత ఏడాది ఆ దేశంలో 2,920 కోట్ల లావాదేవీలు జరిగాయి.

Read Also: Kurnool: కర్నూలులో భార్య, అత్తను హతమార్చిన భర్త

రూ. 1,760 కోట్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో నిలిచింది. థాయ్‌లాండ్‌ (1,650 కోట్ల లావాదేవీలు), దక్షిణ కొరియా (800 కోట్ల లావాదేవీలు) నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయని మైగవ్‌ఇండియా డేటాలో వెల్లడైంది. భారత్‌ డిజిటల్‌ చెల్లింపుల్లో నెంబర్ వన్ గా ఉంది. మొబైల్‌ డేటా సేవలు అత్యంత చౌకగా లభిస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి.. దాంతో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా పరివర్తనం చెందుతోందని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

Read Also: Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‎లో మహిళల ఆందోళన

ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో డిజిటల్‌ చెల్లింపుల లావాదేవలు 100 రెట్లకు పైగా వృద్ధి చెందాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 127 కోట్ల డిజిటల్‌ చెల్లింపు లావాదేవీలు నమోదు అయ్యాయి.. కాగా.. గత ఆర్థిక సంవత్సరంలో 12,735 కోట్ల లావాదేవీలు జరిగాయి.. ఈ ఏప్రిల్‌లో రూ.14.07 లక్షల కోట్ల విలువైన 889 కోట్ల లావాదేవీలు నమోదుకాగా.. మే నెలలో రూ.14.30 లక్షల కోట్ల విలువైన 941 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. అందులో యూపీఐ లావాదేవీల వాటే అధికంగా ఉంది అని మైగవ్‌ఇండియా డేటాలో పేర్కింది.

Read Also: School Bus: నేలకొండపల్లిలో స్కూల్ బస్సు దగ్ధం

ఎన్‌పీసీఐ అభివృద్ధి చేసిన యూపీఐ అందుబాటులోకి వచ్చాక దేశంలో డిజిటల్‌ చెల్లింపు సేవల వినియోగం అనూహ్యంగా పెరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో రోజువారీ యూపీఐ లావాదేవీలే 100 కోట్లకు పైగా నమోదు కావచ్చని పీడబ్ల్యూసీ రిపోర్టు అంచనా వేసింది. వచ్చే ఐదేళ్లలో రిటైల్‌ డిజిటల్‌ లావాదేవీల్లో యూపీఐ వాటానే 90 శాతంగా ఉండనుందని నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీల వాటానే 8,371 కోట్లుగా ఉండగా.. 2026-27 నాటికి 37,900 కోట్లకు చేరుకోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేసింది.