NTV Telugu Site icon

Mukesh Ambani: 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్

Ambani

Ambani

Vibrant Gujarat: గుజరాత్‌ అభివృద్ధికి రిలయన్స్‌ సంస్థ కట్టుబడి ఉంటుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇవాళ గాంధీనగర్‌లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్‌లో ఆయన మాట్లాడుతూ.. గుజరాత్‌లో తన మూలాలు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కంపెనీ నిబద్ధత గురించి తెలియజేశారు. రిలయన్స్ ఎప్పటికీ గుజరాతీ కంపెనీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్‌ అంబానీ ప్రధాన మంత్రి మోడీకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ 20 ఏళ్ల నుంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోందన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతుందన్నారు.. 2047 కల్లా 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారకుండా భారత్ ను ఏ శక్తి అడ్డుకోలేదని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.

Read Also: MLA Katasani Rami Reddy: చంద్రబాబు కామెంట్లపై కాటసాని కౌంటర్‌ ఎటాక్‌

ఇక, మోడీ ప్రపంచ నాయకత్వాన్ని, అసాధ్యాలను సుసాధ్యం చేయగల నాయకుడని అంబానీ చెప్పుకొచ్చారు. ప్రధానిగా మోడీ ఉంటేనే అన్ని సాధ్యం అవుతాయని చెప్పారు.. విజన్‌, డిటర్మినేషన్‌, ఎగ్జిక్యూషన్‌ ఉన్న ప్రధాని మోడీ కోట్ల మంది భారతీయులను ప్రతిబింబిస్తుంది.. ప్రపంచ దేశాల ప్రశంసలను ప్రస్తుతం భారత్ అందుకుంటోందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్దంలో రిలయన్స్ $150 బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.. ఇందులో మూడింట ఒక వంతు గుజరాత్‌కే కేటాయించామని తెలిపారు.. రిలయన్స్ రాబోయే పదేళ్లలో గణనీయమైన పెట్టుబడులతో గుజరాత్ వృద్ధిలో కీలక పాత్ర పోషించబోతుందని చెప్పుకొచ్చారు.. గ్రీన్ గ్రోత్‌లో గుజరాత్ ప్రపంచ అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ముఖేష్ అంబానీ వెల్లడించారు.

Read Also: BCCI Awards 2024: హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్.. ప్రత్యేక అతిథులు ఎవరంటే?

2030 నాటికి రాష్ట్ర ఇంధన అవసరాలలో 50 శాతం పునరుత్పాదక ఇంధనం ద్వారా తీర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కృషి చేస్తుంది అని ముఖేష్ అంబానీ చెప్పారు. రిలయన్స్‌ జియో ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలను అత్యంత వేగంగా మార్కెట్ లోకి తీసుకొచ్చాం.. గుజరాత్‌ను పూర్తిగా 5జీ-ఎనేబుల్ చేశాం.. డిజిటల్ డేటా ప్లాట్‌ఫారమ్‌తో పాటు ఏఐ అడాప్షన్‌లో గుజరాత్ స్టేట్ గ్లోబల్ లీడర్‌గా నిలిచింది అని ఆయన తెలిపారు. 5జీ-ఎనేబుల్డ్‌ ఏఐ విప్లవం మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం లాంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వస్తుందని అంబానీ పేర్కొన్నారు.