Site icon NTV Telugu

India Test Squad: ఇంగ్లాండ్ టూర్ కు భారత టెస్ట్ జట్టు ప్రకటన.. కెప్టెన్ గా గిల్

Gill

Gill

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ తర్వాత, భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ పర్యటనతో ఇది ప్రారంభమవుతుంది. శనివారం టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. శుభ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. భారత జట్టు యువ జట్టుతో నాల్గవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, యువ శుబ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చిన కరుణ్ నాయర్ కూడా జట్టులోకి ఎంపికయ్యాడు. ఫిట్‌నెస్ కారణాల వల్ల మహ్మద్ షమీకి జట్టులో స్థానం లభించలేదు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు.

Also Read:KTR: ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్.. అసలు దెయ్యం అతనే అంటూ..

ముంబైలోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రధాన కార్యాలయంలో జట్టు ఎంపిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశం తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో అజిత్ అగార్కర్ భారత జట్టును ప్రకటించారు.

Also Read:Monsoon: గుడ్‌న్యూస్… రుతుపవనాలు వచ్చేశాయోచ్!

ఇంగ్లండ్ టూర్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్/వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), అభిమన్యు ఈశ్వరన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్ యాదవ్.

భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పూర్తి షెడ్యూల్

1వ టెస్ట్: జూన్ 20-24, 2025 – హెడింగ్లీ, లీడ్స్
2వ టెస్ట్: జూలై 2-6, 2025 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
3వ టెస్ట్: జూలై 10-14, 2025 – లార్డ్స్, లండన్
4వ టెస్ట్: జూలై 23-27, 2025 – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
5వ టెస్ట్: జూలై 31-ఆగస్టు 4, 2025 – ది ఓవల్, లండన్

Exit mobile version