NTV Telugu Site icon

Ind vs Eng: ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​ కు భారత్ జట్టు ఇదే..!

India

India

Team India: ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సీరీస్‌ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు పదహారు మందితో కూడిన టీమ్ ను ఎంపిక చేసినట్లు పేర్కొనింది. టీమిండియా సారథి రోహిత్ శర్మ ఈ జట్టుకు.. ప్రధాన పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఈ జట్టుకు ఎంపిక అయ్యాడు. ఈ సిరీస్ కు ఇషాన్‌ కిషన్‌పై వేటు పడింది. ఇక, కొత్త కుర్రాడు ధ్రువ్‌ జురెల్‌ వికెట్‌ కీపర్‌ కోటాలో స్థానం దక్కించుకున్నాడు. కాగా, జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ జట్ల మధ్య టెస్టులు స్టార్ట్ కానున్నాయి.

Read Also: Marriguda Chain Snatcher: పోలీసులు అదుపులో మర్రిగూడ చైన్ స్నాచర్‌.. వారిని ఎలా ట్రేస్ చేశారంటే ?

తొలి రెండు టెస్టులకు టీమిండియా జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్రె జురెల్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్, కుల్​దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), ఆవేశ్‌ ఖాన్‌.

Show comments