Agni Prime Missile: క్షిపణి ప్రయోగాల్లో భారత్ దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ క్షిపణిని భారత్ ఇవాళ 09.45గంటలకు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు. క్షిపణి అన్ని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. పరీక్ష సమయంలో క్షిపణి సుదీర్ఘ దూరం ప్రయాణించినట్లు వెల్లడించారు.
Iqbal Mehmood: ఏఐఎంఐఎం బీజేపీకి బీ టీమ్.. నిజమైన ముస్లిం ఆ పార్టీకి ఓటు వేయరు..
అగ్ని ప్రైమ్ క్షిపణిని పరీక్షించడం మూడో సారి కాగా.. ఈ పరీక్ష విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు.టెలిమెట్రీ రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ వంటి అనేక రేంజ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ద్వారా పొందిన డేటాను ఉపయోగించి మిస్సైల్ సిస్టమ్ పనితీరు ధృవీకరించబడిందని అధికారులు తెలిపారు. సేకరించిన డేటా ఆధారంగా క్షిపణి పనితీరును అంచనా వేశారు.