Site icon NTV Telugu

UN-India: TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా ఐరాసలో భారత్‌ ప్రయత్నాలు..!

Un India

Un India

UN-India: పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తొయిబా (LeT) తో పనిచేస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ను ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చే దిశగా భారత్ తన కృషిని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం బుధవారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద వ్యతిరేక కార్యాలయం (UNOCT), కౌంటర్-టెరరిజం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ (CTED) అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించింది.

Read Also: Bob Blackman: పీవోకే ఉగ్ర శిబిరాలు నేలమట్టం కావాలి.. పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ఎంపీ..!

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి TRF బాధ్యత వహించింది. ఇది లష్కర్-ఎ-తొయిబా‌కు చెందిన ప్రాక్సీ సంస్థగా భారత్ ఇప్పటికే పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ప్రతిదాడులకు పాల్పడింది.

Read Also: Womens Marriage: ముస్లిం యువకులు హిందువులుగా నటిస్తూ మోసం చేశారు.. అందుకే ఒక్కటయ్యాం..!

ఈ నేపథ్యంలో భారత సంస్కరణల కమిటీ మానిటరింగ్ బృందం, UNOCT, CTED, ఇతర భాగస్వామి దేశాల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ భేటీల్లో TRFను ఉగ్రవాద సంస్థగా గుర్తించాలన్న అంశంపై భారత బృందం తమ ఆధారాలను సమర్పించినట్లు సమాచారం. UNOCT కార్యాలయానికి చెందిన ఐక్యరాజ్యసమితి ఉప ప్రధాన కార్యదర్శి వ్లాదిమిర్ వోరోన్కోవ్, CTED సహాయ ప్రధాన కార్యదర్శి నాటాలియా ఘెర్మన్ భారత ప్రభుత్వం ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో TRFపై నిర్దాక్షిణ్య చర్యలు తీసుకోవాలని భారత్ స్పష్టం చేస్తూ.., అంతర్జాతీయ వేదికలపై దాని ఉగ్రపని చర్యలను తెలపడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జరిగిన ఈ సమావేశాలు అదే లక్ష్యాన్ని సాధించేందుకు మరో కీలక అడుగుగా భావించవచ్చు.

Exit mobile version