India Squad for CWC23: ఇట్స్ ఆఫీషియల్.. ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టు ఇదే! తెలుగోడికి షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Announce India Team for World Cup 2023: భారత్ గడ్డపై ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేసింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా.. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేస్ దళాన్ని నడిపించనున్నాడు.
ఆసియా కప్ 2023తో పునరాగమనం చేసిన స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు ప్రపంచకప్ 2023 జట్టులో చోటు దక్కింది. వన్డేల్లో పెద్దగా రికార్డ్స్ లేని మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. శార్దూల్ ఠాకూర్ ఆల్‌రౌండర్ కోటాలో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఎంపిక కాగా.. యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ, కీపర్ సంజు శాంసన్, పేసర్ ప్రసిధ్ కృష్ణలకు ప్రపంచకప్ జట్టులో అవకాశం దక్కలేదు.
Also Read
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
ప్రపంచకప్ 2023కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.
Squad: Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Ishan Kishan, KL Rahul, Hardik Pandya (Vice-captain), Suryakumar Yadav, Ravindra Jadeja, Axar Patel, Shardul Thakur, Jasprit Bumrah, Mohd. Shami, Mohd. Siraj, Kuldeep Yadav#TeamIndia | #CWC23
— BCCI (@BCCI) September 5, 2023
తాజావార్తలు
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!