సెంచురియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాపై ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. డీన్ ఎల్గార్ (185) సెంచరీ చేయగా.. మార్కో యన్సెన్ (84 నాటౌట్), డేవిడ్ బెడింగ్ హామ్ (56) అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు.
Read Also: Mansukh Mandavia: విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పర్యటన
తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికాకు 163 పరుగుల ఆధిక్యం లభించింది. కాగా.. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ , రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట ఇవాళ మూడో రోజు జరుగుతుంది. మరో రెండున్నర రోజుల ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ ఫలితంపై ఆసక్తి నెలకొంది. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కూడా 400 పైచిలుకు స్కోరు సాధిస్తే, దక్షిణాఫ్రికా ముందు ఓ మోస్తరు లక్ష్యం ఉంచే అవకాశం ఉంటుంది.
Read Also: UP: అయోధ్యలో డ్రెనేజ్, రోడ్లు శుభ్రం చేసిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఏమీ పరుగులు చేయకుండానే కగిసో రబాడా బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్ (5), శుభ్ మాన్ గిల్ (4) ఉన్నారు.