NTV Telugu Site icon

Justin Trudeau: కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు..

India Canada

India Canada

India-Canada Relations: ఖలిస్తాన్ సమస్యపై గతేడాది నుంచి భారత్- కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక, కెనడియన్ పార్లమెంటరీ కమిటీ నివేదికతో ఈ సంబంధాలలో మరింత ఉద్రిక్తతను సృష్టించాయి. కెనడా ప్రజాస్వామ్యానికి భారతదేశం రెండవ అతిపెద్ద ముప్పు అని ఈ నివేదికలో వెల్లడించింది. విదేశీ జోక్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ కమిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ నివేదికలో మొదటి ముప్పు చైనాగా ఆ తర్వాత భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్యానెల్‌లో కెనడాలోని అన్ని పార్టీల ఎంపీలు, భద్రతా అధికారులు కూడా ఉన్నారు.

Read Also: loksabha election results: బీజేపీ గెలుపు పై అంతర్జాతీయ మీడియా ఫోకస్..

కాగా, ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారతదేశ ప్రమేయం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడంతో కెనడా- భారతదేశం మధ్య సంబంధాలు గత ఏడాది క్షీణించాయి. తమపై నిరాధారమైన ఆరోపణ చేయడం మంచిది కాదని ఇండియా ఆ వ్యాఖ్యలను తిరస్కరించింది. ఇప్పటి వరకు కెనడా ఈ విషయంలో ఎలాంటి ఆధారాలను వెల్లడించలేదు.. అయితే, ఇటీవల కెనడాలో ఈ కేసులో పంజాబీ మూలాలున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో భారత్‌ను రెండో ముప్పుగా అభివర్ణించిన కెనడా ప్యానెల్ నివేదిక మే నెలలోనే బయటకు వచ్చింది. అయితే ఈ వారం దానిని పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.

Read Also: Train Accident: చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్లో గూడ్స్ రైలును రైలు ఢీ.. నలుగురు మృతి

ఈ నివేదికలో దేశీయంగా, విదేశాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు కెనడా ప్రజాస్వామ్యంలో చైనా జోక్యం చేసుకుంటోంది అని పేర్కొనింది. మరోవైపు, కెనడా ప్రజాస్వామ్యం, సంస్థలలో జోక్యం చేసుకోవడానికి భారతదేశం వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్యానెల్ తయారు చేసిన నివేదికలో 44 సార్లు ఇండియా పేరును ప్రస్తావించింది. అది రెండో అతిపెద్ద ముప్పుగా అభివర్ణించింది. భారత్ విదేశీ జోక్యం క్రమంగా పెరుగుతోందని కెనడియన్ ప్యానెల్ రూపొందించి నివేదికలో వెల్లడించింది. అయితే, ఈ కెనడా నివేదికపై భారతదేశం ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.