NTV Telugu Site icon

Asia Cup 2024: అక్టోబర్ 19న భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా తిలక్ వర్మ!

Ind Vs Pak

Ind Vs Pak

Asia Cup 2024 India Schedule: అక్టోబర్ 18 నుంచి ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ప్రారంభం కానుంది. ఒమన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో 8 దేశాల ఏ జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుతాయి. అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.

ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 కోసం 15 మందితో కూడిన భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, వైభవ్ అరోరా, సాయి కిశోర్ లాంటి ఐపీఎల్ స్టార్స్ జట్టులో ఉన్నారు. అక్టోబర్ 19న దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. అక్టోబర్ 21న యూఏఈ, అక్టోబర్ 23న ఒమన్‌తో మ్యాచులు ఉన్నాయి. భారత్ మ్యాచులు అన్ని సాయంత్రం 5.30కు ఆరంభం కానున్నాయి.

ఆసియా కప్‌కు భారత్-ఏ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చహర్.

Also Read: IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్‌ ముందు ఐదు రికార్డులు!

షెడ్యూల్:
అక్టోబర్ 19: భారత్ vs పాకిస్థాన్
అక్టోబర్ 21: భారత్ vs యూఏఈ
అక్టోబర్ 23: భారత్ vs ఒమన్
అక్టోబర్ 25: సెమీఫైనల్-1, సెమీఫైనల్-2
అక్టోబర్ 27: ఫైనల్

 

 

 

Show comments