Site icon NTV Telugu

Business Visas: బిజినెస్ వీసాల జారీని వేగవంతం చేయాలి.. అమెరికాకు భారత్ అభ్యర్థన

Business Visas

Business Visas

Business Visas: వ్యాపార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం అమెరికాను అభ్యర్థించిందని, తద్వారా ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కొనసాగించేందుకు ప్రయాణాలను చేపట్టవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన 13వ ఇండియా-యూఎస్ ట్రేడ్ పాలసీ ఫోరమ్‌లో పాల్గొన్న అనంతరం మీడియా సమావేశంలో పీయూష్ గోయల్ మాట్లాడారు. “వాణిజ్యం, వ్యాపార ప్రయోజనాల కోసం చిన్న ప్రయాణాల కోసం వచ్చే సాధారణ వ్యాపార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం యూఎస్‌కు అభ్యర్థన చేసింది” అని ఆయన చెప్పారు.

Ukraine Crisis: ఆ క్షిపణులతో ఉక్రెయిన్‌ ఈ ఏడాది యుద్ధంలో విజయం సాధించగలదు..

రెండు దేశాల మధ్య నిపుణులు, విద్యార్థులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, పెట్టుబడిదారులు, వ్యాపార యాత్రికుల ప్రయాణాలు పెరిగిపోతున్నాయని గోయల్ నొక్కి చెప్పారు. ఇండియా-యూఎస్ ట్రేడ్‌ పాలసీ ఫోరమ్‌లో పాల్గొనడానికి జనవరి 9-11 వరకు మూడు రోజుల పాటు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలలో అధికారికంగా పర్యటించారు. ఈ పర్యటనలో ప్రతినిధి స్థాయి చర్చలతో పాటు యూఎస్ వాణిజ్య ప్రతినిధి కేథరీన్ తాయ్‌తో ఆయన సమావేశమయ్యారు. 2022 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,25,000 స్టూడెంట్ వీసాలు జారీ చేయడంతో భారతదేశంలోని యూఎస్ ఎంబసీ, కాన్సులేట్లు తమ రికార్డును బద్దలు కొట్టాయని స్టేట్ డిపార్ట్‌మెంట్ చెప్పిన వారం తర్వాత బిజినెస్ వీసాల మినహాయింపు కోసం ఈ అభ్యర్థన వచ్చింది.

Exit mobile version