Corona Cases: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల్లో 7,533 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4.49 కోట్లకు పెరిగింది. 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,468కి పెరిగింది. యాక్టివ్ కోవిడ్ కేసులు 53,852కి తగ్గాయి. మొత్తం ఇన్ఫెక్షన్‌లలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 0.12 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Inter students: ఇంటర్ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. మధ్యలో మానేస్తే ఫీజు వాపసు
మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పంచుకున్న డేటా ప్రకారం.. జాతీయ కొవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా నమోదైంది. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,47,024కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. భారతదేశంలో ఇప్పటివరకు మొత్తం 4.49 కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.