NTV Telugu Site icon

Covid-19 : భారత్ లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..

Covid

Covid

భారత దేశంలో కరోనా తీవ్రత మెల్లిమెల్లిగా పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కొత్త కేసులు నమోదువుతున్నాయి. ఇప్పటికే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మౌలిక వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గత 11 రోజుల నుంచి 5 వేలకు పైగానే కొత్త కేసులు నమోదు అవుతుండటంతో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 4,282 కరోనా కేసులు నమోదు కావడం విశేషం. ఇక కరోనా వైరస్ కారణంగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదే విజయాన్ని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Also Read : Delhi: అమానుషం.. వ్యక్తిని కారుతో గుద్ది బ్యానెట్ పై 3కి.మీ లాక్కెళ్లిన ఎంపీ డ్రైవర్

దీంతో దేశంలో కొత్తగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యతో పోల్చుకుంటే ఇప్పటి వరకు దేశంలో 5,21,5447కి పెరిగింది. ఇందులో కేరళలో 6 మంది ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. ఇక యాక్టివ్ కేసుల సంఖ్యా పరంగా చూస్తే 47,246 గా ఉంది. ఇప్పటి వరకు 5,874 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 49,015గా ఉంది. ఇవాళ నమోదైన రోజు వారీ సానుకూలత రేటు 4.92 శాతం కాగా వారాంతపు పాజిటివిటీ రేటు 4.00 శాతంగా ఉంది. మొత్తంగా కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లుగా ఉంది. అంటే 4,49,49,671 గా ఉంది. మొత్తం ఇన్ఫెక్షన్ లో 0.11 :శాతం ఉండగా.. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.71 శాతంగా నమోదైంది. అయితే ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 వరకు 87,038 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 4.282 మందికి పాజిటివ్ వచ్చింది.

Also Read : Future of Jobs 2023: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల్లో కోత విధించే ఛాన్స్