Covid Cases in India: దేశంలో గత 24 గంటల్లో 10,093 కొవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది శనివారం నాడు నమోదైన 10,747 కేసుల సంఖ్య కంటే 6 శాతం తక్కువ. గత రెండు వారాల్లో ఇటీవలి ఇన్‌ఫెక్షన్ల పెరుగుదలలో దేశంలో 10,000 కేసులు నమోదవడం ఇది వరుసగా నాలుగో రోజు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 57,542గా ఉంది. గడిచిన 24 గంటల్లో 19 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తికిసూచిక అయిన డైలీ పాజిటివిటీ రేటు 5.61 శాతంగా నమోదైంది.
Read Also: Sangareddy Crime: సంగారెడ్డిలో దారుణం.. చెరువులో గురుకుల విద్యార్థి మృతదేహం
కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. మరో 10-12 రోజుల వరకు కేసులు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.