Site icon NTV Telugu

Covid-19 : భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Covid

Covid

భారతదేశంలో 535 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు 6,591 నుంచి 6,168కి తగ్గాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. ఐదు మరణాలతో మరణాల సంఖ్య 5,31,854కి పెరిగింది. ఇందులో కేరళ మూడు మరణాలు నమోదు అయ్యాయి. కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లు (4,49,88,426) నమోదైంది.

Also Read : Ram Charan: ప్రభాస్ ఫ్రెండ్ తో చరణ్ కొత్త బిజినెస్?

దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసులు మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.01 శాతం ఉన్నాయి. అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.80 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,44,50,404 కు పెరిగింది. కరోనా మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు అందించబడ్డాయి.

Also Read : TATA Group : త్వరలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల మార్కెట్‌లోకి టాటా కంపెనీ

అయితే మరో వైపు.. చైనాపరిస్థితి దారుణంగా ఉంది. తాజాగా చైనాలో పెరుగుతున్న కరోనా కేసులపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్‌ను నియంత్రించడంలో చైనా విజయం సాధించినప్పటికీ, కఠినమైన ‘జీరో కోవిడ్’ విధానాన్ని వదిలేసింది. దీని పరిణామాలు భయంకరంగా ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు. జూన్ చివరి నాటికి కోవిడ్-19 కేసులు వారానికి 6.5 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

Also Read : Water Crisis: గుక్కెడు నీటి కోసం జనం తిప్పలు.. ప్రాణాలకు తెగిస్తున్న మహారాష్ట్రవాసులు

ప్రఖ్యాత శ్వాసకోశ వ్యాధుల నిపుణులు జాంగ్ నాన్షాన్ చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన ఒక సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. కొత్త XBB ఒమిక్రాన్‌ వేరియంట్ ఆవిర్భావంతో ప్రస్తుత ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగిందని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా ఏప్రిల్ చివరి నుంచి కేసులు ఎక్కువగా నమోదయ్యాయని స్పష్టం చేశారు.

Exit mobile version