Ram Charan: ప్రభాస్ ఫ్రెండ్ తో చరణ్ కొత్త బిజినెస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన సాహూ, రాధే శ్యామ్ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది యువి క్రియేషన్స్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాని కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న యువి క్రియేషన్స్ ప్రభాస్ కి హోమ్ బ్యానర్ లాంటిది. ప్రమోద్, విక్రమ్ కలిసి స్టార్ట్ చేసిన ఈ బ్యానర్ నుంచి భారీ బడ్జట్ సినిమాలు వస్తుంటాయి. చిన్న సినిమాలని, యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చెయ్యడానికి ఇతర బ్యానర్ తో కలిసి సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడానికి యువి కాన్సెప్ట్స్ అనే బ్యానర్ ని కూడా స్టార్ట్ చేసారు. ఈ బ్యానర్ కి ప్రభాస్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు యువి క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన విక్రమ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నాడు. యంగ్ టాలెంట్ తో పాటు పాన్ ఇండియా సినిమాలని కూడా ప్రొడ్యూస్ చెయ్యడానికి చరణ్, విక్రమ్ కోలాబోరేట్ అయ్యారు.
ఈ కోలాబోరేషన్ కి ‘యువి మెగా పిక్చర్స్’ అనే పేరుని డిసైడ్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసారు. ఈ బ్యానర్ నుంచి మంచి స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రభాస్, చరణ్, శర్వానంద్, గోపీచంద్, అనుష్క లాంటి స్టార్స్ యువి మెగా పిక్చర్స్ బ్యానర్ లో సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది. చరణ్ కి ఆల్రెడీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ పై ఖైదీ నంబర్ 150, సైరా, ఆచార్య లాంటి సినిమాలని చరణ్ ప్రొడ్యూస్ చేసాడు. చిరుతో మాత్రమే సినిమాలు చేసిన చరణ్, ఫ్యూచర్ లో విక్రమ్ తో టైఅప్ అయ్యి ఇతర హీరోల సినిమాలని కూడా ప్రొడ్యూస్ చేస్తాడేమో చూడాలి. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలని చరణ్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు. మరి ఆ సినిమాని చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉంటుందా లేక విక్రమ్ తో కలిసి యువి మెగా పిక్చర్స్ పై చేస్తాడా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!