Corona Cases: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల ముందు వందల్లో నమోదైన కేసులు.. ప్రస్తుతం వేలల్లో నమోదవుతుండడం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా 24 గంటల్లో 3,095 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి క్రియాశీల కేసుల సంఖ్య 15,208కి పెరిగింది. కరోనా మహమ్మారి కారణంగా 24 గంటల వ్యవధిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,30,867కి పెరిగింది . కరోనాతో కేరళలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. గోవా, గుజరాత్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు.
Read Also: MBBS Student suicide: నిజామాబాద్ లో కలకలం.. మరో మెడికో స్టూడెంట్ ఆత్మహత్య
డైలీ పాజిటివిటీ రేటు 2.61 శాతంగా నమోదు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.91 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి ఇప్పటివరకు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లు (4,47,15,786)గా నమోదైంది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ తెలిపింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.41 కోట్లు (4,41,69,711) గా నమోదైంది. కరోనా మరణాలు 1.19 శాతంగా నమోదయ్యాయి. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వబడ్డాయి.