NTV Telugu Site icon

WHO Trachoma Free India: వైద్యరంగంలో దేశానికి అద్భుత విజయం.. ట్రాకోమా ఫ్రీగా అవతరించిన భారత్

Trachoma

Trachoma

WHO Trachoma Free India: ట్రాకోమా.. అంటే క్లామిడియా ట్రాకోమాటిస్ వైరస్ వల్ల కలిగే కంటి వ్యాధి. ప్రపంచంలోని ప్రజలు పాక్షికంగా అంధత్వానికి ప్రభావితమవుతారు. ఈ వ్యాధి చేతులు, బట్టలు, పరుపులు లేదా గట్టి ఉపరితలాల ద్వారా ద్వారా వ్యాపిస్తుంది. ఇది కంటికి నొప్పిని కలిగిస్తుంది. అంతేకాకుండా కార్నియాను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఇకపోతే ఈ ఏడాదిలో భారతదేశ ఆరోగ్య రంగం పెద్ద విజయాన్ని సాధించింది. దేశం ఇప్పుడు ట్రాకోమా వ్యాధి నుండి విముక్తి పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి ట్రాకోమా వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆగ్నేయాసియా ప్రాంతంలో ఈ ఘనత సాధించిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అంతకుముందు నేపాల్, మయన్మార్ కూడా ఆగ్నేయాసియా ప్రాంతంలో ట్రాకోమాను తొలగించిన దేశాల లిస్ట్ లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 19 దేశాలు ట్రాకోమాను తొలగించడంలో విజయవంతమయ్యాయి.

Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు

ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ సమాచారం ఇస్తూ.., ట్రాకోమా అనే ప్రజారోగ్య సమస్యను ఈ బాధాకరమైన వ్యాధి నుండి లక్షలాది మందిని విముక్తి చేయడానికి భారతదేశం సాధించిన విజయాలు, దేశం నిబద్ధతకు నిదర్శనమని భారత ప్రభుత్వం ప్రశంసించింది. ఇక సంస్థ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. భారతదేశం సాధించిన ఈ విజయం వెనుక ప్రభుత్వ బలమైన నాయకత్వం, ఆరోగ్య కార్యకర్తల నిబద్ధత ఉందని అన్నారు.

Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునిసెఫ్ సహకారంతో 1963లో దేశంలో ఈ వ్యాధికి వ్యతిరేకంగా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సమగ్ర ట్రాకోమా నియంత్రణ కార్యకలాపాల కార్యక్రమంతో పాటు జాతీయ ట్రాకోమా నియంత్రణ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ 79.1%, రాజస్థాన్ 74.2%, ఉత్తరప్రదేశ్ 68.1% ఉన్నాయి. ఇది కాకుండా, గుజరాత్‌లో 56%, మధ్యప్రదేశ్‌లో 41.3%, బీహార్‌లో 30%, జమ్మూ కాశ్మీర్‌లో 60% ట్రాకోమా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.