Swag : శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు : శ్రీ విష్ణు
- శ్రీవిష్ణు హసిత్ గోలి కాంబోలో వచ్చిన శ్వాగ్
- సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర యూనిట్
- శ్రీవిష్ణుతో మరో సినిమా చేయనున్న పీపుల్స్ మీడియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి లేటెస్ట్ కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, విమర్శకులు ప్రశంసలు అందుకొని కంటెంట్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఆడియన్స్ విక్టరీ శ్వాగ్ సక్సెస్ మీట్ లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు బాగున్నాయి అనిపిస్తాయి. ఇంకొన్ని సినిమాలు అంత లేదులే అనిపిస్తాయి. సినిమా చూసినోళ్లు 90% సాటిస్ఫై అయ్యారు. 10% కొంచెం కాంప్లెక్స్ ఉంది అని ఫీల్ అయ్యారని హసిత్ చెప్పాడు. శ్వాగ్ సినిమాని ఎవ్వరూ కూడా బాలేదని అనలేదు. దానికి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏమీ లేని నాకు ఇంత గుర్తింపు ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ రుణం తీర్చుకోవాలి. హసిత్ నా ఫ్యాన్. నాకు ఒక తమ్ముడిలా. ఆడియన్స్ నేను చేసిన ప్రతి క్యారెక్టర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి రాస్తే దీన్ని కొట్టేది రాయాలి. రాస్తాడనే నమ్మకం కూడా ఉంది. విశ్వ గారు మాకు ఇంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి కథను చేయలేం. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లి మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. ఆ 10% కూడా కంగారు పడకండి. నెక్స్ట్ సినిమాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. లేకపోతే లావు అయిపోతాను (నవ్వుతూ) అందరికీ థాంక్యూ’ అన్నారు
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ. శ్వాగ్ ని ఇంత అద్భుతంగా ఆదరించిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ. సినిమాని చక్కగా ప్రమోట్ చేసిన మీడియాకి థాంక్యూ. నేను టీజర్ లాంచ్ ఈవెంట్ లోనే శ్రీ విష్ణు ని కమల్ హాసన్ గారితో పోల్చడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాను. ఇంద్రుడు చంద్రుడు, మైఖేల్ మదన్ కామరాజు, భామనే సత్యభామనే సినిమాల్లో కమలహాసన్ గారు చేసింది మనం ఒక్క సినిమాలో చూడచ్చని చెప్పాను. ఈ సినిమా కంటెంట్ విషయంలో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. హసిత్ శ్రీ విష్ణు చాలా వర్క్ చేశారు. శ్రీ విష్ణు తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. అలాగే హసిత్ నెక్స్ట్ ఇయర్ మరో మూవీ చేయబోతున్నాం’అన్నారు.
డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్ తో మేము ఈ సినిమా గురించి పడిన రెండున్నర ఏళ్ల కష్టాన్ని మర్చిపోయాం. మీడియా, ఆడియన్స్ నుంచి వచ్చిన ఇంత అద్భుతమైన స్పందన నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ఆడియన్స్ కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన హీరో శ్రీ విష్ణు గారికి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ‘శ్రీ విష్ణు ది గ్రేటెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది డెకేడ్’ అనే ప్రశంసలు వింటున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. గూప్స్ బంప్స్ వస్తున్నాయి’ అని అన్నారు.
తాజావార్తలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
-
AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!