NTV Telugu Site icon

India China Conflict: చైనాకు మోడీ సర్కార్ స్ట్రాంగ్ కౌంటర్.. టిబెట్‌లోని 30 ప్రాంతాల పేర్లు మార్పు..?

Ind China

Ind China

India China Conflict: భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో దూకుడు ప్రదర్శిస్తుంది. మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ తన కఠిన వైఖరిని ప్రదర్శించడం మొదలు పెట్టారు. డ్రాగన్ కంట్రీ చైనాకు గుణపాఠం చెప్పేందుకు మోడీ ప్రభుత్వం పక్కా ప్రణాళిక రచించింది. చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని రెండు డజన్లకు పైగా స్థలాల పేర్లను మార్చాలని భారత్ యోచిస్తున్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల క్రితం అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల పేర్లను చైనా మార్చినట్లు భారత్ కూడా టిబెట్ లో మార్చాలని చూస్తుంది. ఈ పేర్లకు సంబంధించి టిబెట్ స్థానిక ప్రజల అభిప్రాయం తీసుకోబడింది.. దానిపై విస్తృతమైన చారిత్రక పరిశోధన కూడా కొనసాగుతుంది.

Read Also: PAK vs CAN: కెనడాపై విజయం.. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ బోణీ!

అదే సమయంలో చైనాకు తగిన బుద్ది చెప్పేందుకు టిబెట్ లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్ల జాబితాను త్వరలో మీడియాలో భారత్ బహిరంగ పర్చబడుతుంది. ఈ పేర్ల విషయంలో డ్రాగన్ కంట్రీ చైనా నుంచి ఖచ్చితంగా నిరసన వ్యక్తమవుతుంది. ఇటీవల భారత ఆర్మీ ఉన్నతాధికారులు వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను సందర్శించారు. అదే చైనా అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాన్ని జంగనన్ అని పిలుస్తుంది. అయితే, చైనా యొక్క అన్ని రకాల వాదనలను భారతదేశం నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంది.