Site icon NTV Telugu

ICC World Cup 2023: దాయాదుల పోరు ఎప్పుడో తెలుసా..?

World Cup 2023

World Cup 2023

క్రికెట్‌ ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (మంగళవారం) ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ టోర్నీలో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం 48 మ్యాచ్‌లు పది వేదికల్లో జరుగనుంది.

Read Also: Dharmapuri Arvind: మెజార్టీ స్థానాల్లో గెలుస్తాం.. మా స్ట్రాటజీ మాకుంది

ఇక వన్డే ప్రపంచకప్‌ 2023లో మొత్తం 10 టీమ్స్ పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. టాప్ 4 జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఆపై రెండు జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. ఇక ఈ మెగా ఈవెంట్ లో చిరకాల ప్రత్యర్ధిలు భారత్‌-పాకిస్తాన్‌ టీమ్స్ ఆక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా తాడోపేడో తెల్చుకోనున్నాయి. అదే రోజు పాకిస్తాన్‌ సారథి బాబర్‌ ఆజం పుట్టిన రోజు కావడం విశేషం.

Read Also:Devara: ఎన్టీఆర్ కి సోలో రిలీజ్ కష్టమే… పోటీగా పాన్ ఇండియా సినిమా

ఇక.. దాయాదుల పోరు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుండడంతో దాదాపు లక్ష మందికి పైగా క్రికెట్ ప్రేక్షకులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 1 లక్షా 32 వేలుగా కాగా.. అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది కాబట్టి.. ఈ గ్రౌండ్ లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తుంది.

Read Also:Jr NTR fan last video: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ చివరి వీడియో..

ఐసీసీ వరల్డ్ కప్‌లలో టీమిండియాకి పాకిస్తాన్‌పై మంచి రికార్డు ఉంది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్‌లో మొదటిసారి భారత్‌పై పాకిస్తాన్‌ వరల్డ్ కప్ లో గెలిచింది. అనంతరం టీ20 వరల్డ్ కప్‌-2022 లో విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌తో పాక్ పై టీమిండియా సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ వరల్డ్‌కప్‌కు ముందు మరోసారి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. ఆసియాకప్‌-2023లో పాకిస్తాన్‌-భారత్‌ జట్లు తలపడనున్నాయి. కాబట్టి ఇరు దేశాల అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.

Exit mobile version