Site icon NTV Telugu

Emerging Asia Cup Final: టైటిల్ పోరులో భారత్‌-పాకిస్తాన్‌.. హాట్ ఫేవరెట్‌ ఏ జట్టు తెలుసా..?

Emerging Asia Cup Final

Emerging Asia Cup Final

ఆసియా ఎమర్జింగ్‌ కప్‌ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. శ్రీలంక రాజధాని కొలంబోలో నేడు జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌ ‘ఎ’తో టీమిండియా ‘ఎ’ జట్టు పోటీ పడుతుంది. ఇరు జట్ల బలాబలాలను బట్టి చూస్తే యశ్‌ ధుల్‌ నాయకత్వంలోని టీమిండియానే హాట్ ఫేవరెట్‌గా బరిలో నిలుస్తోంది. లీగ్‌ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. టోర్నీలో యశ్ ధుల్, సాయి సుదర్శన్‌ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు.. ఇప్పటికే చెరో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేశారు.

Read Also: Sangareddy: హెల్మెట్ పెట్టుకుని మూడు టమాటా బాక్సులు చోరీ.. ఎక్కడో తెలుసా?

ఇక, బౌలింగ్‌లో కూడా నిశాంత్‌ సింధు 10 వికెట్లతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. పాకిస్తాన్‌ టీమ్‌ను చూస్తే పలువురు ఆటగాళ్లు మొహమ్మద్‌ వసీమ్, కెప్టెన్‌ మొహమ్మద్‌ హారిస్, ఫర్హాన్, అర్షద్‌ ఇక్బాల్‌లకు ఇప్పటికే సీనియర్‌ టీమ్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో వీరు చెలరేగితే టీమిండియాకు తీవ్ర పోటీ ఎదురువ్వక తప్పదు అని చెప్పొచ్చు. మరి చూడాలి.. ఆసియా ఎమర్జింగ్ కప్ ఎవరికి దక్కుతుందో అనేది.

Read Also: Suriya: హీరో కాకముందు సూర్య ఏం చేశారో తెలుసా?

తుది జట్లు(అంచనా):
భారత్‌: సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ, యశ్ ధుల్ (కెప్టెన్‌), ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్, నికిన్ జోస్, నిశాంత్ సింధు, హర్షిత్ రాణా, మానవ్ సుతార్, రాజవర్ధన్ హంగర్గేకర్, యువరాజ్‌
పాకిస్తాన్‌: సయీమ్ అయూబ్, తయ్యబ్ తాహిర్, మహ్మద్ హారీస్ (కెప్టెన్‌), సాహిబ్జాదా ఫర్హాన్, ఒమైర్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, ముబాసిర్ ఖాన్, అమద్ బట్, మహ్మద్ వసీం, అర్షద్ ఇక్బాల్, సుఫియాన్ ముఖీమ్

Exit mobile version