Site icon NTV Telugu

India Pak War: శ్రీ నగర్‌లో మళ్లీ పేలుళ్లు.. దాల్ సరస్సులో మిస్సైల్ కలకలం.!

Srinagar

Srinagar

India Pak War: భారత్‌పై పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో చేస్తున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీనగర్‌లో మరోసారి భీకరమైన పేలుళ్లు సంభవించాయని ఆర్మీ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 11.45 గంటల ప్రాంతంలో శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పేలుళ్ల శబ్దం వినగానే అధికారులు వెంటనే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా అవంతిపురం సమీపంలో కూడా ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, శ్రీనగర్‌లోని ప్రఖ్యాత దాల్ సరస్సులో క్షిపణి లాంటి ఒక వస్తువు పడినట్లు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున కూడా శ్రీనగర్ విమానాశ్రయం, ఎయిర్ బేస్‌లపై పాకిస్తాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా, భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది.

India-Pakistan War: వెనక్కి తగ్గిన పాకిస్తాన్‌..! భారత్‌ ముందు కీలక ప్రతిపాదన..

సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ వరుసగా దాడులకు పాల్పడుతుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, బాల్కనీల్లో ఉండకుండా వెంటనే ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. పంజాబ్‌లోని బఠిండాలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో తరచూ పేలుళ్లు సంభవిస్తుండటంతో, దానితో సహా ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని మొత్తం 32 విమానాశ్రయాలను ఈనెల 15వ తేదీ వరకు మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారత సైన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది.

OperationSindhoor: పాకిస్థాన్ లో ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లు ధ్వంసం.. వీడియోలు విడుదల చేసిన భారత ఆర్మీ

Exit mobile version