NTV Telugu Site icon

Team India: పొట్టి క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు

Team India

Team India

Team India: రాయ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 నాలుగో మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా ప్లేయర్లు సమష్టిగా రాణించడంతో.. ఆస్ట్రేలియాను 20 పరుగుల తేడాతో ఓడించింది యంగిస్థాన్. మరో మ్యాచ్‌ ఉండగానే.. 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ 46, యశస్వీ జైస్వాల్ 37, రుతురాజ్ గైక్వాడ్ 32 పరుగులతో రాణించారు. అయితే.. తిలక్ వర్మ ప్లేస్‌లో టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కేవలం 8పరుగులు మాత్రమే చేసాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి కారణమైన శ్రేయస్ అయ్యర్.. రెస్ట్‌ తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనూ తడబడ్డాడు. రింకూ సింగ్ చెలరేగి 29 బంతుల్లో 46 పరుగులు చేయడంతో.. టీమిండియా 174 పరుగులు చేసింది.

Read Also: Prashanth Neel: KGF వల్లే సలార్ డిలే… షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన నీల్!

175 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. ట్రావిస్ హెడ్ 16 బంతుల్లోనే 31 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో.. 3 ఓవర్లలోనే 40 పరుగులు చేసింది. పరిస్థితి ముందే ఊహించిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. రవి బిష్ణోయ్‌ను రంగంలోకి దింపాడు. సూర్యకుమార్ యాదవ్ ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. జోష్ ఫిలిప్పీ బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే.. ట్రావిస్ హెడ్‌ను అక్షర్ పటేల్ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో ఆసీస్ 2 వికెట్లకు 52 పరుగులు చేసింది. ఆ వెంటనే ఆరోన్ హార్డీ, బెన్ మెక్‌డెర్మోట్‌ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేసి కోలుకోలేని దెబ్బకొట్టాడు. టీమ్ డేవిడ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేసినా.. దీపక్ చాహర్ వరుస ఓవర్లలో అతనితో పాటు మాథ్యూ షార్ట్‌ను పెవిలియన్‌కు పంపించాడు.

Read Also: Liquor Josh: వామ్మో ఏంటి మూడు రోజుల్లో అంత తాగారా..!

చివర్లో మాథ్యూ వేడ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డా.. మరో ఎండ్‌నుంచి సపోర్ట్‌ లేకపోవడంతో.. ఆస్ట్రేలియా ఓడిపోయింది. తొలి రెండు టి20ల్లో నెగ్గిన భారత్.. మూడో టి20లో ఓడింది. రాయ్ పూర్ వేదికగా జరిగిన నాలుగో టి20లో భారత్ 20 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. దీంతో.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సొంతం చేసుకుంది టీమిండియా. ఈ విజయంతో పొట్టి క్రికెట్‌ఫార్మాట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది.. టీ 20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచంది.. 213 మ్యాచ్‌లు ఆడి 136 విజయాలు సాధించడంతో.. టీ20ల్లో సత్తా చాటింది భారత జట్టు.. పొట్టి ఫార్మెట్‌లో ఇదే అత్యధికం.. ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్థాన్‌ 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు పాక్‌ను రెండోస్థానానికి నెట్టి.. టాప్‌ స్పాట్‌కు దూసుకెళ్లింది భారత్‌… ఇక, కివీస్‌ 200 మ్యాచ్‌లలో 102 విక్టరీలు, ఆస్టేలియా 181 మ్యాచ్‌లలో 95 గెలుపులు, సౌతాఫ్రికా 171 మ్యాచ్‌లలో 95 విజయాలతో వరుసగా లిస్ట్‌లో ఉన్నాయి.. మరోవైపు సొంత గడ్డపై భారత్‌ వరుసగా 5 టీ20 సిరీస్‌లు గెలుచుకోవడం మరో విశేషం.