Site icon NTV Telugu

India anti dumping duty China: గ్యాస్‌ సంక్షోభ సమయంలో భారత్‌ సంచలన నిర్ణయం దిశగా అడుగులు.. చైనాకు షాక్..!

India Anti Dumping Duty Chi

India Anti Dumping Duty Chi

India anti dumping duty China: ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేవాల్లో ఇంధన, గ్యాస్‌ సంక్షోభం తలెత్తింది.. అయితే, ప్రపంచ ఇంధన సంక్షోభం మధ్య భారత్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. భారత ప్రభుత్వం, చైనా నుండి దిగుమతి అవుతున్న చౌక ఎల్ఎన్‌జీ (LNG) ట్యాంకులపై యాంటీ-డంపింగ్ సుంకాలు విధించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నిర్ణయం దేశీయ తయారీదారులను రక్షించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. ఇదే సమయంలో.. ఇది డ్రాగన్‌ కంట్రీకి షాక్‌ లాంటిది..

ఈ నిర్ణయం ఎందుకు?
వాణిజ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విచారణలో, చైనా కంపెనీలు ఎల్ఎన్‌జీ ట్యాంకులను అసలు ధర కంటే తక్కువకు (డంపింగ్ ధరలకు) విక్రయిస్తున్నట్లు తేలింది. దీని వల్ల భారతీయ కంపెనీలు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాయి. ఈ అంశంపై Inox India Limited ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది.

యాంటీ-డంపింగ్ సుంకం అంటే ఏమిటి?
యాంటీ-డంపింగ్ సుంకం అనేది విదేశీ కంపెనీలు తక్కువ ధరలకు వస్తువులు విక్రయించి దేశీయ పరిశ్రమలను నష్టపరచకుండా నివారించేందుకు విధించే పన్ను. ఈ సుంకం విధిస్తే.. చైనా ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి.. భారతీయ కంపెనీలకు సమాన పోటీ అవకాశం లభిస్తుంది.. దేశీయ తయారీ రంగం బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు..

చౌక దిగుమతుల వల్ల:
అయితే చౌక దిగుమతల వల్ల స్థానిక కంపెనీల లాభాలు తగ్గాయి.. ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింది.. మార్కెట్‌లో డిమాండ్ కూడా తగ్గింది.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ సిఫార్సులపై త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇంధన సంక్షోభ సమయంలో భారత్ తీసుకుంటున్న ఈ చర్య, దేశీయ పరిశ్రమలను రక్షించడమే కాకుండా, భవిష్యత్తులో ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..

Exit mobile version