NTV Telugu Site icon

Medicine Price : ఫార్మా కంపెనీలపై ‘రూల్స్’ కత్తి.. భారీగా పెరగనున్న మందుల ధరలు

New Project (4)

New Project (4)

Medicine Price : భారతదేశాన్ని ప్రపంచ ఔషధ కర్మాగారం అంటారు. చౌక ఔషధాలను తయారు చేయడంలో భారతదేశానికి సాటి మరేదేశం లేదు. అయితే రాబోయే రోజుల్లో ఇది మారే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ప్రజల చికిత్స ఖర్చు పెరగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే మందుల ధరలు త్వరలో భారీగా పెరిగే అవకాశం ఉంది. వాస్తవానికి మందుల కొరత కారణంగా కొంతకాలం తర్వాత వాటి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం కొన్ని నియమాలను రూపొందించింది. అవి తమ ఫ్యాక్టరీలను నిర్వహించే ప్రామాణిక పద్ధతులకు (SOPలు) సంబంధించినవి. ఈ నిబంధనల కారణంగా దేశంలో చౌకగా మందులను తయారు చేస్తున్న అనేక చిన్న కంపెనీలు ఫ్యాక్టరీ మూసివేత ముప్పును ఎదుర్కొంటున్నాయి.

Read Also:kodi Pandalu: సై అంటున్న కోడి పుంజులు.. సిద్ధమైన బరులు

ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీల పని విధానాలకు సంబంధించి సవరించిన నిబంధనల ‘షెడ్యూల్-ఎం’కి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ఎంత పెద్ద ఆఫీసు ఉండాలి, ఎంత పెద్ద ఫ్యాక్టరీ ఉండాలి, ఏ ప్లాంట్లు, ఏ పరికరాలు వాడాలి అనే విషయాలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి సంబంధించిన వివరాలను అందించారు. డ్రగ్స్ ఉత్పత్తికి మంచి పద్ధతులు ఏవి అనే సమాచారం కూడా ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు, ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం నాణ్యత సమీక్ష, నాణ్యత రిస్క్ మేనేజ్‌మెంట్‌ను కూడా సమీక్షించవలసి ఉంటుంది. దీంతో దేశంలోని పలు చిన్న, మధ్య తరహా ఔషధ కంపెనీలు మూతపడే ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఈ నిబంధనలను అనుసరించడానికి ఆ కంపెనీలకు తగినంత వనరులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మందుల కొరత తప్పదు. దీంతో మందుల ధరలు పెరగనున్నాయి.

Read Also:Asifabad: కాగజ్‌ నగర్‌ పులులు చంపిన కేసు.. ముగ్గురు నిందితుల్లో ఒకరు 11 ఏళ్ల బాలుడు

మైక్రో, స్మాల్ అండ్ మీడియం (ఎంఎస్‌ఎంఈ) ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ‘షెడ్యూల్-ఎం’ని తప్పనిసరి చేస్తామని గతేడాది జూలైలో ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవియా స్పష్టం చేశారు. దశలవారీగా దీన్ని అమలు చేయనున్నారు. ఏడాదికి రూ. 250 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్‌ని కలిగి ఉన్న కంపెనీలు ఆగస్టు 1, 2023 నాటికి ఈ నిబంధనలను పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. చిన్న కంపెనీలకు ఒక సంవత్సరం సమయం లభిస్తుంది. చిన్న తరహా ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ‘షెడ్యూల్-ఎం’ని అమలు చేయడం చాలా కష్టమైన పని అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో అనుబంధంగా ఉన్న ‘లఘు ఉద్యోగ్ భారతి’ అనే సంస్థ పేర్కొంది. కంపెనీలు నాణ్యతపై నియమాలను అనుసరించవచ్చు, కానీ అప్‌గ్రేడ్ చేయడానికి మూలధనం అవసరం. చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని మూసివేయవలసి ఉంటుంది.